ఆర్ఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి టికెట్ రేట్ల గురించి ఎడతెరిపి లేని చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నైజాంలో దీని ప్రభావం చాలా గట్టిగా పడటంతో ప్రతి సినిమాను జనం గుడ్డిగా చూస్తారని భ్రమపడిన నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు తెరుచుకున్నాయి. దానికి తగ్గట్టుగానే తగ్గించడం మీద దృష్టి పెట్టాయి. ఎఫ్3 ప్రమోషన్ లో దిల్ రాజు పదే పదే ఈ విషయాన్ని హైలైట్ చేస్తుండగా మీడియాలో, పిఆర్ ల ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఈ వీడియో బైట్ వైరల్ అయ్యింది. కానీ నిజంగా ఈ తగ్గింపు బెస్టా అంటే కాదని చెప్పాలి.
ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం ఎఫ్3 టికెట్ రేట్ మల్టీ ప్లెక్సులో 250 రూపాయలు. ఇది సామాన్యుడు ఒక కుటుంబంతో భరించే ధర కాదు. పోనీ రెండు వందలు అన్నా ఒక రీతిలో ఉండేది. సింగల్ స్క్రీన్లకు సైతం 150 ప్లస్ జిఎస్టి ఫిక్స్ చేశారు. కానీ అసలైన తగ్గింపు మాత్రం శేఖర్ సినిమాకు కనిపిస్తోంది. రేపు విడుదల కాబోతున్న ఈ మూవీకి పివిఆర్, ఐనాక్స్ లాంటి పేరుమోసిన కార్పొరేట్ చైన్లు టికెట్ ధరని 150 రూపాయలు ఉంచాయి. మొన్నటిదాకా అశోకవనంలో అర్జున కళ్యాణం 200కు అమ్మింది ఈ సంస్థలే.
అటు ఏపిలోనూ దీని ధరను గణనీయంగా తగ్గించారు. బాల్కనీ 145 ఉన్న చోట 110 రూపాయలు చేసి సెకండ్ క్లాస్ ని 70 రూపాయలకే కుదించారు. ఇది మంచి పరిణామం. చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలకు ఇలా చేస్తే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అలా కాకుండా ఏదో బజ్ లేని సినిమాకు తగ్గించి మళ్ళీ కొంచెం హైప్ ఉన్నా చాలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. చూడాలి రాజశేఖర్ తన భవిష్యత్తు ఆశలన్నీ శేఖర్ మీదే పెట్టుకున్న తరుణంలో ఈ టికెట్ రేట్లు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.
This post was last modified on May 19, 2022 7:03 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…