పూజా హెగ్డేను సౌత్ హీరోయిన్ అని చెప్పలేం. బేసిగ్గా ఆమె ముంబయి భామే. కానీ ఆమె పాపులర్ అయింది.. హిట్లు కొట్టింది.. ఆధిపత్యం చలాయిస్తోంది సౌత్ సినిమాలోనే. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో ఆమె నంబర్ వన్ హీరోయిన్. ఇక్కడ ఈ స్థాయిలో ఉండడం పట్ల పూజా చాలా సంతోషపడుతూ ఉంటుంది. టాలీవుడ్‌కే తన తొలి ప్రాధాన్యం అని చెబుతుంటుంది.
ఐతే మామూలుగా సౌత్‌లో పాపులరై, ఇక్కడ టాప్ రేంజిలో ఉన్న హీరోయిన్లకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రాధాన్యం దక్కదు. అక్కడి నుంచి ఎక్కువగా పిలుపు వచ్చేది, అక్కడ బాగా హైలైట్ అయ్యేది బాలీవుడ్ హీరోయిన్లే. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే.. ఇలా ఎప్పుడూ బాలీవుడ్ హీరోయిన్లదే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సందడంతా. కానీ ఈసారి కథ మారింది. ఇండియన్ బాక్సాఫీస్‌లో సౌత్ సినిమా ఆధిపత్యానికి తగ్గట్లే కేన్స్‌లో కూడా సౌత్ టాప్ హీరోయిన్లదే హవా కనిపించింది.
ముఖ్యంగా పూజా హెగ్డే అక్కడ మామూలుగా హైలైట్ అవ్వట్లేదు. ఈ రోజు ప్రిన్సెస్ గౌన్‌లో పూజా హెగ్డే అందరికీ కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఆమె అందాన్ని ఎలివేట్ చేసేలా అదిరిపోయే డ్రెస్ వేయడం.. స్టైలింగ్, మేకింగ్ భలేగా సెట్ అవ్వడంతో పూజా నుంచి అక్కడున్న వాళ్లు చూపు తిప్పుకోలేకపోయారు. ఆమె కంటే ముందు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కేన్స్ వేదికలో బాగానే సందడి చేసింది. కానీ పూజా అంతలా హైలైట్ కాలేకపోయింది.
ఇక వీళ్లిద్దరి ముందు బాలీవుడ్ భామలు అస్సలు నిలవలేకపోయారు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే లాంటి సీనియర్లు ఈసారి కూడా కేన్స్‌కు వచ్చారు కానీ.. ఇప్పుడు బాలీవుడ్లో వాళ్ల క్రేజ్ పడిపోయినట్లే ఇక్కడా రెస్పాన్స్ అంతంతమాత్రంగా కనిపించింది. అందం, స్టైలింగ్ అన్నింట్లోనూ పూజా హెగ్డే వారిని పక్కకు నెట్టేసి కేన్స్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది.
This post was last modified on May 19, 2022 2:42 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…