బాలకృష్ణ -బోయపాటి కాంబో అంటే పక్కా బ్లాక్ బ్లాస్టర్ అనే నమ్మకం వచ్చేసింది. మూడు సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ కాంబో. తాజాగా వచ్చిన ‘అఖండ’ బాలయ్య కి అదిరిపోయే రేంజ్ హిట్ అందించింది. టికెట్ రేటు పెంచకుండానే సినిమా మంచి వసూళ్ళు రాబట్టి ఇండస్ట్రీకి కూడా షాక్ ఇచ్చింది. బాలయ్య డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమా 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి.
ప్రస్తుతం బోయపాటి అదే పనిలో ఉన్నాడట. రైటర్స్ తో ‘అఖండ 2’ కోసం కథా చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది. నిజానికి బాలయ్య -బోయపాటి కాంబోలో ఓ పొలిటికల్ సినిమా రావాల్సి ఉంది. దాన్ని వచ్చే ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బోయపాటి అఖండ సీక్వెల్ మీద దృష్టి పెట్టి ఆ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. పాపకి ఇచ్చిన మాట కోసం అఖండ రుద్ర సికందర్ అఘోర మళ్ళీ రావడం లీడ్ గా తీసుకొని ప్రస్తుతం కథ రెడీ చేస్తున్నాడట బోయపాటి.
అఖండ ను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సీక్వెల్ ని భారీ బడ్జెట్ తో నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అఖండతో మంచి లాభాలు దక్కడంతో ఇప్పుడు సీక్వెల్ ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని బోయపాటితో డిస్కషన్ చేస్తున్నాడట. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసి మళ్ళీ బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చేయనున్నాడు. ఇక బోయపాటి కూడా ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. బాలయ్య కమిట్ మెంట్స్ అయ్యే లోపు బోయపాటి ‘అఖండ 2’ కథ రెడీ చేసి షూటింగ్ కి రెడీ అవుతాడు.
This post was last modified on May 19, 2022 9:57 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…