కొవిడ్ దెబ్బకు సినీ రంగం ఎంతగా కుదేలైందో తెలిసిందే. సినిమాను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగా నష్టపోయారు ఆ సమయంలో. ఐతే ఆ నష్టం తాత్కాలికం కూడా కాదు. ప్రభావం ఇంకా కొనసాగుతోంది, కొనసాగబోతోంది కూడా. ఓటీటీలకు బాగా అలవాటు పడ్డ జనం ఇప్పుడు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. పెరిగిన టికెట్ల ధరలు కూడా ప్రతికూల ప్రభావం చూపి.. వారిని థియేటర్లకు దూరం చేస్తున్నాయి. భారీ చిత్రాలైతే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. వాటికి కూడా టాక్ కొంచెం అటు ఇటుగా ఉంటే గట్టి దెబ్బ పడుతోంది.
ఇక చిన్న సినిమాల కష్టం అయితే మామూలుగా లేదు. చాలా బాగుంది అన్న టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు వచ్చి చిన్న సినిమాలు చూడట్లేదు. చాలా సినిమాలకు రిలీజ్, థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క ‘డీజే టిల్లు’ తప్పితే.. మరే చిన్న చిత్రానికీ థియేటర్లలో ఆశించిన స్పందన లేకపోయింది. ఇటీవల ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా దానికి వచ్చిన వసూళ్లు అంతంతమాత్రమే. కాకపోతే మంచి టాక్ వల్ల ఈ చిత్రానికి అదిరిపోయే ఓటీటీ డీల్ దక్కింది. చిన్న సినిమాలను చాలా వరకు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నది కూడా ఇందుకే. ఇక్కడ మంచి టాక్ తెచ్చుకుని ఓ మోస్తరుగా ఆడితే తప్ప.. ఓటీటీల్లో కూడా ఆశించిన డీల్స్ రావట్లేదు. కుప్పలు కుప్పలుగా చిన్న సినిమాలు తయారవుతుండటంతో ఓటీటీలు కూడా ఆచితూచి ఎంచుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న ప్రతి సినిమానూ వాళ్లేమీ కొనేయట్లేదు. మంచి డీల్స్ ఇవ్వట్లేదు. రిలీజ్‌కు ముందే డీల్స్ పూర్తి చేసుకుంటున్న చిన్న సినిమాలు చాలా తక్కువ. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆఫర్లు కూడా అన్ని సినిమాలకూ రావట్లేదు.
ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ చేయడం, మంచి టాక్ తెచ్చుకోవడం, సినిమా గురించి కొంత చర్చ జరిగేట్లు చూడడం చాలా అవసరం. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కు ఇవన్నీ జరిగాయి కాబట్టే దానికి మంచి డీల్ వచ్చింది. కానీ ఇలా ఎన్ని సినిమాలకు జరుగుతుందన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే చిన్న సినిమాల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతుందన్నది స్పష్టం.
This post was last modified on May 18, 2022 2:18 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…