వచ్చే నెల జూన్ 10న నాని అంటే సుందరానికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం సర్కారు వారి పాట సంబరాల్లో ఉన్నారు కాబట్టి అవి పూర్తి కాగానే న్యాచురల్ స్టార్ కోసం ప్రమోషన్లు మొదలుపెడతారు. ఆ తేదీకి వస్తున్న మరో పోటీ చిత్రం 777 ఛార్లీ ఒకటే. అతడే శ్రీమన్నారాయణతో మనకూ పరిచయమైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా టైటిల్ రోల్ ని ఓ కుక్క పోషిస్తోంది. గ్రాఫిక్స్ కాదండోయ్. నిజం శునకాన్నే వాడామని యూనిట్ చెబుతోంది. ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు.
సరే దీంతో నానికి పోటీ ఏంటని అభిమానులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ తక్కువంచనా వేయడానికి లేదు. హిందీతో కలిపి 777 ఛార్లీ అయిదు భాషల్లో వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా రెండు రోజులు గడవకుండానే మూడు మిలియన్ల వ్యూస్ కి దగ్గరగా వెళ్లిపోయింది. జీవితంలో అన్ని వదిలేసి ఒంటరిగా బ్రతుకుతున్న ఓ నిరాశావాది యువకుడి దగ్గరకి ఓ కుక్క వచ్చాక అతని లైఫ్ లో జరిగే అద్భుతాల సారమే 777 ఛార్లీ అసలు కథ.
సోషల్ మీడియా వేదికగా దీన్ని సెలబ్రిటీలు బాగానే షేర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రానా స్నేహాలు ఇక్కడ ఉపయోగపడుతున్నాయి లెండి. ఎటొచ్చి అంటే సుందరానికి మాత్రం మూడు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ పరంగా చూసుకున్నా ఇమేజ్ లెక్కలు వేసుకున్నా నాని మూవీతో 777 ఛార్లీ సమానం కాదు కానీ స్టార్లకు అతీతంగా కంటెంట్ మార్కెట్ ని శాశిస్తున్న తరుణంలో ఫలితాలు ఎలా వస్తాయో చెప్పలేం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న అంటే సుందరానికిలో హీరోయిన్ పుష్ప విలన్ ఫహద్ సతీమణి నజ్రియా.
This post was last modified on May 17, 2022 11:14 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…