ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు బన్నీ ?

ప్రెజెంట్ స్టార్ హీరోలంతా రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఒకటి తర్వాత మరొకటి జెట్ స్పీడులో కంప్లీట్ చేస్తూ ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ని మినహాయించాల్సిందే. అవును బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతం సుకుమార్ తో ‘పుష్ప 2’ మాత్రమే లిస్టులో ఉంది. సుకుమార్ సినిమాతో జూన్ లేదా జులై లో సెట్స్ పైకి వెళ్లనున్నాడు బన్నీ. నిజానికి ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత కొరటాల శివతో బన్నీ ఓ సినిమా చేయాలి. ఎనౌన్స్ మెంట్ తర్వాత ఆ సినిమా అనుకోకుండా క్యాన్సెల్ అయ్యింది. మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు.

ఇక బన్నీ లిస్టులో ఎప్పటి నుండో మురుగదాస్ సినిమా ఉంది. కానీ అది కూడా ఇప్పుడే ఉండకపోవచ్చు. త్రివిక్రమ్, బోయపాటి లతో కూడా బన్నీ కమిటై ఉన్నాడు. బోయపాటి ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బాలయ్యతో ‘అఖండ 2’ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమా తర్వాత చిరంజీవితో లేదా వెంకటేష్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఇటివలే బన్నీ ముంబై ఓ స్టార్ డైరెక్టర్ ని కలిసి వచ్చాడు. ఒకవేళ బాలీవుడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా ?

ఇలా బన్నీ నెక్స్ట్ కోసం దంపేడు లిస్టు ఉంది. కానీ ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ తో పాటు మినిమం రేంజ్ డైరెక్టర్స్ కూడా ఖాళీగా లేరు. మరి ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ప్లానేంటి ? ఎవరితో సినిమా చేస్తాడు ? ఈ ప్రశ్నలు ఫ్యాన్స్ లో మెదులుతున్నాయి. మరి బన్నీ లేదా అతని టీం నుండి ఏదైనా అప్ డేట్ వచ్చే వరకూ నెక్స్ట్ ఏంటి ? అనే ప్రశ్న బన్నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.