దక్షిణాది వారి మీద హిందీ భాషను బలవంతంగా రుద్దడం మీద కొంత కాలంగా పెద్ద చర్చే నడుస్తోంది. స్వయంగా హోం మంత్రి అమిత్ షానే.. కామన్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్ బదులు హిందీని వాడాలని వ్యాఖ్యానించడం, అలాగే కొందరు ఉత్తరాది నేతలు హిందీ జాతీయ భాష అని, అందరూ దాన్ని నేర్చుకుని తీరాలని కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై దక్షిణాది నేతలు, సెలబ్రెటీలు తీవ్రంగా స్పందించడమూ తెలిసిందే.
కన్నడ నటుడు సుదీప్ ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ హిందీ ఇంకెంత మాత్రం జాతీయ భాష కాదని, హిందీ సినిమాల పనైపోయిందని మాట్లాడటం.. దానికి ప్రతిగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఘాటుగా స్పందించడం.. దీనిపై వాదోపవాదాలు జరగడం విదితమే. ఇప్పుడీ చర్చలోకి లోకనాయకుడు కమల్ హాసన్ వచ్చాడు. హిందీ విషయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మామూలుగా తమిళ భాష మీద అమితాభిమానం చూపించే కమల్.. హిందీ విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తారని అనుకుంటారంతా. కానీ ఆయన అలాంటి కామెంట్లేమీ చేయలేదు. హిందీకి తాను వ్యతిరేకంగా కాదని, ఆ భాష నేర్చుకుంటే తప్పేమీ లేదని ఆయనన్నారు. కానీ హిందీ.. తమ భాష అయిన తమిళానికి అడ్డుగా వస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
“తమిళం వర్ధిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా. దీనికి, రాజకీయాలకు సంబంధం లేదు. మాతృభాషను ఎవరూ మరవకండి. హిందీకి నేను వ్యతిరేకిని అని చెప్పను. అలాగే గుజరాతీ, చైనీస్.. ఇలా ఏ భాష అయినా నేర్చుకోండి, మాట్లాడండి. కానీ ఒక భాష ఇంకో భాషకు అడ్డు రాకూడదు. నా మాతృభాషకు హిందీ అడ్డుపడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను” అని కమల్ స్పష్టం చేశారు. కమల్ సినిమాలు హిందీలో కూడా అదరగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన కొత్త చిత్రం ‘విక్రమ్’ కూడా హిందీలో రిలీజవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
This post was last modified on May 17, 2022 4:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…