ఓవైపు హిందీ సినిమాలకు కనీస స్థాయిలో వసూళ్లు ఉండట్లేదు. పెద్ద హీరోలు, పేరున్న కాంబినేషన్లలో సినిమాలు చేసినా ఓపెనింగ్స్ దారుణంగా ఉంటున్నాయి. మరోవైపేమో సౌత్ సినిమాల్ని అనువాదం చేసి పెద్దగా ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజ్ చేస్తుంటే అవి వసూళ్ల మోత మోగించేస్తున్నాయి.
దీంతో బాలీవుడ్ జనాలకు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితి తలెత్తుతోంది. నెల కిందట రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2 ఇంకా మంచి వసూళ్లు రాబడుతుంటే.. గత వీకెండ్లో వచ్చిన హిందీ సినిమా జయేష్ భాయ్ జోర్దార్ తొలి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది.
రోజు రోజుకూ హిందీ చిత్రాల వసూళ్లు పడిపోతుండటం.. సౌత్ సినిమాల హవా పెరుగుతుండటంతో బాలీవుడ్ జనాలు లోలోన ఉడికిపోతున్నారు. ఇలాంటి టైంలో వారి ఆశలన్నీ ఓ సినిమా మీద నిలిచాయి. అదే.. భూల్ భూలయియా-2.
అక్షయ్ కుమార్ నటించిన చంద్రముఖి రీమేక్ భూల్ భూలయియాకు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని అనీస్ బజ్మి రూపొందించాడు. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా.. కియారా అద్వానీ, టబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ముందు నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సరదాగా, థ్రిల్లింగ్‌గా సాగడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. చాన్నాళ్ల తర్వాత ఓ హిందీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నది ఇప్పుడే. విడుదలకు ఐదు రోజుల ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.1 కోటి రూపాయలు రాబట్టిందట.
ఈ ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక స్థాయి ఉన్న హిందీ చిత్రాలకు తొలి రోజు రూ.10 కోట్ల ఓపెనింగ్స్ మామూలు విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు అదో పెద్ద టార్గెట్‌లాగా మారిపోయింది. భూల్ భూలయియా-2 ఆ మార్కును అందుకుని మళ్లీ బాలీవుడ్‌కు ఊపు తీసుకొస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది.
This post was last modified on May 17, 2022 10:33 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…