సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు వెనక మిస్టరీ ఇంకా వీడలేదు. సుషాంత్ తో స్నేహ, వ్యాపార, వృత్తి పరమైన సంబంధాలు ఉన్న అందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ఆ విచారణ పర్వం ముగియలేదు. వారు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మీడియా హియరింగ్ ఇస్తారు. అయితే విచారించిన వారిలో సుషాంత్ గర్ల్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న రియా చక్రవర్తిని మాత్రం తొమ్మిది గంటల పాటు విచారించడం పలు పుకార్లకు తావిస్తోంది.
అయితే వీరిద్దరితోను స్నేహం ఉన్న బాలీవుడ్ దర్శకుడు రూమీ జాఫ్రీ వారి రిలేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పాడు. ఇద్దరితో అతను త్వరలో ఒక సినిమా తీయాల్సి ఉంది. లాక్ డౌన్ టైంలో సుషాంత్ తోనే రియా చాలా రోజులు ఉన్నదని, జూన్ 6న ఇద్దరి మధ్య గొడవ జరిగాక వెళ్ళిపోయిందని, వారు ఆరోజు బ్రేకప్ అయినట్టే తెలిసిందని అతను చెప్తున్నాడు.
బ్రేకప్ కి తోడు, తన మాజీ మేనేజర్ ఆత్మహత్య సుషాంత్ ని మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఉండవచ్చునని, అతను డిప్రెషన్ మెడికేషన్ కూడా మానేసినట్టు తెలిసిందని జాఫ్రీ చెప్పాడు. అయితే రియా మాత్రం ఇంత వరకు సుషాంత్ గురించి పబ్లిక్ గా స్పందించలేదు. మీడియాకు కూడా ఆమె మొహం చాటేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates