ఈ నెల 20న ఓటిటిలో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ మరోసారి హోమ్ థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. రిపీట్ షోలు వేసుకుని తమ స్టార్లను మళ్ళీ మళ్ళీ చూసి తరించేందుకు ప్రిపేరవుతున్నారు. అయితే తెలుగుతో పాటు ఇతర సౌత్ బాషల హక్కులు పొందిన జీ5 సంస్థ దీన్ని పే పర్ వ్యూ మోడల్ లో ఇస్తుండటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ థియేటర్లో చూసేందుకే వందలు ఖర్చుపెట్టాక ఈ ఎక్స్ ట్రా బాదుడేంటని వాళ్ళ ప్రశ్న.
జీ5 సంస్థ కోట్లు పెట్టి రైట్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అంశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకుంది. డిజిటల్ ప్రీమియర్ నాటికి రెండు నెలలు కంప్లీట్ అయినట్టే. అలాంటప్పుడు వంద రెండు వందలు కట్టేసి అది కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చూడాలని చెప్పడం కరెక్ట్ కాదనేది విమర్శకుల అభిప్రాయం. ఒకవేళ సల్మాన్ ఖాన్ రాధే టైపులో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయితే సొమ్ములు అడిగినా తీసుకున్నా న్యాయంగా ఉంటుంది.
అసలే ఇది పైరసీ విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న కాలం. వెబ్ సైట్స్ ని బ్లాక్ చేస్తే టెలిగ్రామ్ లో వదులుతున్నారు. అక్కడ ఆంక్షలు విధిస్తే గూగుల్ డ్రైవ్స్ లో అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నారు. రూపం మారుతోంది తప్ప ఈ రక్కసి ఇండస్ట్రీని వదిలిపెట్టడం లేదు. అలాంటప్పుడు ఫైనల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాకు ఇలాంటి పద్ధతి తీసుకురావడం సరి కాదేమో. తెలుగు నయం. హిందీ వెర్షన్ బుక్ మై షోలో చూడాలంటే మూడు వందలు పైనే వదిలించుకోవాల్సిందే. ఫ్రీగా చూడాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు ఆగక తప్పదు
This post was last modified on May 16, 2022 7:54 am
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…