క్రేజీ ప్రాజెక్ట్ .. పవన్ కోసం వెయిటింగ్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. లిస్టులో ఎన్ని ఉన్నా పవన్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం హరీష్ శంకర్ సినిమానే. పదేళ్ళ క్రితం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించి ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు హరీష్ శంకర్.
అందుకే పవన్ తో సినిమాలు చేసిన దర్శకుల్లో హరీష్ శంకర్ అంటే ఫ్యాన్స్ కి ఎక్కువ ఇష్టం. ఇక ఈ క్రేజీ కాంబో మరోసారి కలుస్తుందనే ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకొని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈపాటికే సినిమా సెట్స్ పైకి వచ్చేసి ఉండాలి. హరీష్ శంకర్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మైత్రి నిర్మాతలు కూడా పవన్ ని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. అయినా ఎందుకో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి మిగతా సినిమాలపై పవన్ ఆసక్తి కనబరుస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ ఇవ్వకుండా ఓ రీమేక్ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ తో కలిసి సన్నాహాలు చేసుకుంటున్నాడట పవన్.

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే అటు క్రిష్ సినిమాతో పాటు ప్యార్లర్ గా హరీష్ శంకర్ తో సినిమా కూడా సెట్స్ పై ఉండాలి. కానీ సెట్స్ కి వెళ్ళకుండా ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతుంది. ఓ సందర్భంలో ఈ కాంబో సినిమా ఆగిపోయిందనే రూమర్ కూడా సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

హరీష్ కానీ మేకర్స్ కానీ దీని గురించి ప్రత్యేకంగా ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా వారి పని చూసుకుంటున్నారు. ఈ గ్యాప్ లో మరో సినిమా చేసే ఆలోచన కూడా హరీష్ కి లేదని తెలుస్తుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పవన్ ఎప్పుడు డేట్స్ దెప్పుడో ? అదిరిపోయే లోక్ తో సెట్స్ లోకి కాలుపెట్టేదెప్పుడో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.