మే 20: ‘ఆర్ ఆర్ ఆర్’ vs ‘ఆచార్య’

ప్రస్తుతం థియేటర్ రిలీజ్ తో పాటు ఓటీటీ రిలీజ్ కూడా కీలకంగా మారుతుంది. ఆడియన్స్ ని తమ ఫ్లాట్ ఫాంలోకి తీసుకొచ్చేందుకు ఓటీటీ సంస్థలు ప్రతీ శుక్రవారం కొన్ని కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు పోటీ పడుతూ మరీ బడా సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. వచ్చే వారం అంటే 20న రెండు బడా సినిమాలు రిలీజ్ అంటూ ఆయా ఓటీటీ సంస్థలు ప్రకటించాయి. అందులోకి ఆ రెండు సినిమాలు ఒకే హీరోకి చెందినవి కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

జీ5 లో మే 20న ‘ఆర్ ఆర్ ఆర్’ స్ట్రీమ్ అవ్వబోతుంది. వారం రోజుల ముందే ఫ్యాన్స్ కి మేటర్ తెలిసిపోవడంతో సోషల్ మీడియాలో సంస్థ చెప్పకముందే డేట్ బయటికి వచ్చేసింది. జీ5 మాత్రం కాస్త ఆలస్యంగా డేట్ ఎనౌన్స్ చేశారు. కాకపోతే అప్పటికే డేట్ లీక్ అవ్వడంతో ఆ సినిమాకు పోటీగా అమెజాన్ సంస్థ ‘ఆచార్య’ స్ట్రీమింగ్ కూడా అదే రోజు ప్లాన్ చేసుకొని తాజాగా ప్రకటించారు.

నిజానికి ‘ఆచార్య’తో పోలిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ చూసేందుకే ఓటీటీ ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉంటారు ఇది అందరికీ తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ యాబై రోజుల తర్వాత జీ5 లో రిలీజ్ చేయాలని ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ముందుగా జీ ప్లేక్స్ లో పెయిడ్ ప్రీమియర్ పెడుతున్నారు. తర్వాత జీ5 స్ట్రీమ్ కానుంది.

ఇక ‘ఆచార్య’ని ముందుగా నలబై రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. కానీ సినిమా థియేటర్స్ లో వర్కౌట్ అవ్వకపోవడంతో రోజులు తగ్గించుకొని మళ్ళీ అమెజాన్ వాళ్ళు కొత్తగా అగ్రిమెంట్ చేయించుకున్నారట.

ఏదేమైనా ఒకే రోజు రెండు సినిమాలతో రామ్ చరణ్ ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ‘ఆర్ ఆర్ ఆర్’తో పోలిస్తే ‘ఆచార్య’ ఎంత వ్యూవర్ షిప్ అందుకుంటుందో చూడాలి.