నిమా పరిశ్రమలో సెంటిమెంట్ల గురించి రాయడం మొదలైతే అదొక పెద్ద బుక్కే అవుతుంది. ఇంకెక్కడా లేనన్ని సెంటిమెంట్లు ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా నెగెటివ్ సెంటిమెంట్లు అయితే మరీ ఎక్కువ. ఇలాంటివి మామూలుగా నమ్మని వాళ్లు కూడా సినీ రంగంలో భాగం అయితే వాటికి కనెక్ట్ అయిపోతుంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ కావడం వల్లే ఈ భయాలు అందరినీ వెంటాడుతాయి. ఈ మధ్యే ఒక కొత్త నెగెటివ్ సెంటిమెంట్ చర్చనీయాంశంగా మారింది.
టికెట్ల ధరల సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన హీరోల సినిమాలు తేడా కొడతాయన్నదే ఆ సెంటిమెంట్. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్న మాట వాస్తవం. చంద్రబాబుకు ముడిపెట్టి అనేక నెగెటివ్ సెంటిమెంట్లను గతంలో వైసీపీ వాళ్లు ప్రచారం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు టీడీపీ వాళ్లు ప్రతీకారం మొదలుపెట్టారు. జగన్‌ను ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు కలవడం తెలిసిందే. ఐతే వీరిలో ముందుగా ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజైంది. అది పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే.
ఆ తర్వాత ‘ఆచార్య’ విడుదలైంది. దాని ఫలితమూ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’ రిలీజైంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సెంటిమెంటును గుర్తు చేస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఈ జాబితాలో కలిపేశారు. ఏపీ సీఎంతో ఈ ముగ్గురు హీరోలున్న ఫొటోను వైరల్ చేస్తూ ‘జగన్ శాపం’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఐతే ‘సర్కారు వారి పాట’ రిజల్ట్ మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. సినిమా మరీ తీసిపడేసేలా లేదు. కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఈ చిత్రం బోర్ కొట్టకుండా టైంపాస్ అయితే చేయించేస్తుంది. అన్నింటికీ మించి మహేష్ బాబు అభిమానులను బాగాఎంటర్టైన్ చేశాడు. సినిమా యావరేజ్‌గా ఉంది. దీనికి మహేస్ స్టార్ పవర్ కూడా తోడై సినిమాను ముందుకు లాక్కెళ్తుందేమో చూడాలి. ముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే దీని మీద బయ్యర్ల బెట్స్ మరీ ఎక్కువ కాదు. మరి సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందేమో చూడాలి.
This post was last modified on May 12, 2022 10:42 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…