టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల సినిమాలు ఏవి రిలీజైనా సరే.. అవి ఏ టైపు చిత్రాలు, దర్శకులెవరు, రిలీజ్ టైమింగ్ ఏంటి అన్నది సంబంధం లేకుండా తొలి రోజు హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ అన్ని షోలకూ ఫుల్స్ పడిపోతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతాయి. వాటి ద్వారానే చాలా వరకు ఫుల్స్ పడిపోతుంటాయి. ఏమైనా కొన్ని టికెట్లు ఆగినా.. అవి వాక్ ఇన్స్‌తో ఫుల్ అయిపోతుంటాయి. మొత్తంగా 95 శాతానికి పైగా థియేటర్లు నాలుగు షోలకూ ఫుల్ కావడం జరుగుతుంటుంది.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. రెండు వారాల కిందట వచ్చిన ‘ఆచార్య’ సినిమాకు తొలి రోజు చాలా థియేటర్లలో ఫుల్స్ పడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. తొలి రోజే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ఏరియాలో టాప్ థియేటర్లలో ‘సర్కారు వారి పాట’కు ఫుల్స్ పడలేదు. ముందు రోజు రాత్రి సంధ్య థియేటర్లో 7.30 షో మినహాయిస్తే.. మిగతా నాలుగు షోల్లో ఒక్కటి కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో లేదు.
ఉదయం కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు. మార్నింగ్, మ్యాట్నీ షోలకు ఇక్కడ ఫుల్స్ పడలేదు. డివైడ్ టాక్ నేపథ్యంలో తర్వాతి రెండు షోలు కూడా ఫుల్ కావడం కష్టం లాగే ఉంది. సంధ్య థియేటర్ అనే కాదు.. హైదరాబాద్ సిటీలో చాలా థియేటర్లలో ఫుల్ ఆక్యుపెన్సీ కనిపించలేదు. తెల్లవారుజామున 4 గంటలకు నాలుగు థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తే అవేవీ కూడా ఫుల్ కాని పరిస్థితి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రెగ్యులర్ షోలకు ఆశించిన స్థాయిలో ఫుల్స్ లేవు. తెలంగాణలోనే మరింత ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. ఇది మహేష్ సినిమా వరకు సమస్యలా కనిపించడం లేదు.
మొత్తంగా టాలీవుడ్ మీదే నెగెటివ్ ఎఫెక్ట్ నడుస్తున్నట్లుంది. మామూలుగానే టికెట్ల రేట్లను పెంచేయగా.. పెద్ద సినిమాలకు తొలి పది రోజులు అదనపు రేట్లు పెడుతుండటంతో జనాలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లే ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ.250, మల్టీప్లెక్సుల్లో రూ.400 పెట్టి సినిమా చూడటం ఎవరికైనా ఇబ్బందే. ఆ రేటుకు తగ్గ విజువల్ ఎక్స్‌పీరియన్స్, భారీతనం ఉంటేనే థియేటర్లకు వెళ్లాలని, లేదా సినిమా చాలా బాగుందని టాక్ వస్తే చూద్దామని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.
అందుకే ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’లకు ఏమీ ఆలోచించకుండా ఎంత రేటైనా చూశారు. ఆచార్య, సర్కారు వారి పాట లాంటి మామూలు చిత్రాల పట్ల ఆసక్తి కనబరచట్లేదు. అసలే కొవిడ్ కారణంగా థియేటర్లకు వెళ్లే అలవాటు తగ్గగా.. దీనికి తోడు టికెట్ల రేట్ల ప్రబావం ఇండస్ట్రీకి పెద్ద షాకిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికైనా అప్రమత్తమై రేట్లు తగ్గించకుంటే పుట్టి మునగడం ఖాయం.
This post was last modified on May 12, 2022 8:11 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…