ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడు కమల్ హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియాలో ఇంకెవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఐదేళ్ల వయసులోనే తెరంగేట్రం చేసి 60 ఏళ్లకు పైగా నటనలో కొనసాగడం ఆయనకే చెల్లు. ఐతే గత దశాబ్ద కాలంలో కమల్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు. చేసిన సినిమాలు తక్కువ. అందులో విశ్వరూపం-1 మాత్రమే బాగా ఆడింది. పొలిటికల్ పార్టీ పెట్టాక కమల్ దాదాపు సినిమాలకు దూరమైపోయినట్లే కనిపించారు. ఐతే రాజకీయాల్లో ఎదురు దెబ్బ తిన్నాక కమల్ మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నాడు.
ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో కమల్ విక్రమ్ అనే ఎగ్జైటింగ్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి నటులు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషించడంతో విక్రమ్‌పై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. జూన్ 3న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టింది చిత్ర బృందం. ముందుగా ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. తమిళంలో పత్తల పత్తల అంటూ సాగే ఈ పాటను స్వయంగా కమలే రాసి, పాడడం విశేషం.
ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన అనిరుధ్ రవిచందర్ మంచి ఊపున్న ట్యూన్ ఇవ్వగా.. కమల్ తనదైన శైలిలో పాటను రాయడమే కాక.. మంచి ఎనర్జీతో పాడారు. అంతకుమించి ఈ పాటలో కమల్ వేసిన స్టెప్పులు సూపర్ అనే చెప్పాలి. కమల్ ఎంత మంచి డ్యాన్సరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ 70వ పడికి చేరువ అవుతూ.. ఈ పాటలో ఆయన చూపించిన ఎనర్జీ అసామాన్యం అనే చెప్పాలి.
స్టెప్పులు చాలా సరదాగా, లైవ్లీగా సాగడం.. పాట చిత్రీకరణ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ పాట ఇన్‌స్టంట్ హిట్టయిపోయింది. త్వరలోనే ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 15న వివిధ భాషల్లో విక్రమ్ ట్రైలర్ లాంచ్ కానుంది. అది అంచనాలకు తగ్గట్లు ఉంటే సినిమా మీద హైప్ అంకా పెరగడం ఖాయం.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…