కొన్ని నెలల ఊహాగానాల గర్వాత గత ఏడాది అక్టోబరులో తమ విడాకుల గురించి వెల్లడించింది అక్కినేని నాగచైతన్య, సమంత జంట. ప్రేమలో ఉండగా, పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట.. వివాహం జరిగిన నాలుగేళ్ల లోపే ఇలా విడిపోవడం అభిమానులకు ఎంతో బాధ కలిగించింది. మరి విడాకులకు దారి తీసిన కారణాలేంటనే విషయంలో చాలా చర్చే నడిచింది మీడియా, సోషల్ మీడియాల్లో. కానీ ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ.. ఈ విషయం మీద ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.
దాని గురించి భవిష్యత్తులోనూ వీళ్లిద్దరూ మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. మరి వీరి సన్నిహితులైనా ఈ విషయంలో ఏమైనా మాట్లాడతారేమో అని చూస్తున్నారు జనాలు. కాగా సినీ రంగంలో సమంతకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకులపై అడిగిన ప్రశ్నకు స్పందించింది.
సమంత తనకు చాలా క్లోజ్ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య కొన్ని హద్దులు ఉన్నాయని.. అందుకే విడాకుల గురించి తనను ఏమీ అడగలేదన్నట్లుగా నందిని వ్యాఖ్యానించింది.
‘‘నా కెరీర్, అలాగే సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభయ్యాయి. మేమిద్దరం కలిసి మొదటగా జబర్దస్త్ సినిమా చేశాం. ఆ టైంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నపుడు, అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు నేను తన పక్కన ఉన్నాను. అప్పుడు మా మధ్య సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. కానీ ఎంత క్లోజ్ అయినా కూడా మా మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్‌పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం.
సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి జనాలకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది’’ అని నందినీ రెడ్డి పేర్కొంది.
This post was last modified on May 12, 2022 6:03 am
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…
‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్…