పెద్ద ఫ్యామిలీస్ నుంచి హీరోగా అరంగేట్రం చేశాక ఏదో ఒక దశలో పేరు వెనుక ఒక ట్యాగ్ వేసుకోవాల్సిందే. కొందరు హీరోలైతే అరంగేట్రంతోనే ట్యాగ్‌తో వచ్చేస్తారు. ఇంకొందరేమో కొన్ని సినిమాలు చేశాక ట్యాగ్ తీసుకుంటారు. ఒకప్పుడైతే అభిమానులే ప్రేమతో ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చేవాళ్లు కానీ.. ఇప్పుడు మాత్రం హీరోలే తమకు తాముగా బిరుదులు ఇచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. ముందు ఒక ట్యాగ్ పెట్టుకుని.. ఆ తర్వాత మారిన ఇమేజ్‌కు తగ్గట్లుగా ఇంకో బిరుదు తగిలించుకునే హీరోలూ ఉన్నారు. ఇప్పుడు ఓ యువ కథానాయకుడు తన పేరు ముందు పెట్టుకున్న ట్యాగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆ హీరో మరెవరో కాదు.. సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా టాలీవుడ్లోకి అడుగు పెట్టి కొన్నేళ్ల వాళ్ల అండతోనే అవకాశాలు దక్కించుకున్న సుధీర్.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. చివరగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంతో పలకరించిన సుధీర్ బాబు.. ప్రస్తుతం నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టాడు హర్షవర్ధన్. ఫస్ట్ లుక్ కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. ఐతే ఈ పోస్టర్ మీద సుధీర్ బాబు పేరు ముందు ‘నైట్రో స్టార్’ అని వేయడం విశేషం. టాలీవుడ్ ఎన్నో ట్యాగ్స్ చూశాం కానీ.. ఈ ‘నైట్రో స్టార్’ మాత్రం చిత్రంగా అనిపిస్తోంది.
ఇదేమైనా సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్లు తాత్కాలికంగా పెట్టుకున్న ట్యాగా.. లేక పర్మనెంట్‌గా ఇదే పెట్టారా అన్నది తెలియడం లేదు. ఈ ట్యాగ్ అయితే క్యాచీగా మాత్రం లేదన్నది వాస్తవం. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సుధీర్ వెల్లడించడం విశేషం. అతను గతంలో ‘బాగి’లో విలన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ వైపు వెళ్లలేదు. తొలిసారిగా అతను చేసిన తెలుగు చిత్రం హిందీలోనూ రిలీజ్ కాబోతోంది.
This post was last modified on May 11, 2022 4:50 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…