సహజంగా ఇద్దరు దర్శకులకు ఒకే ఐడియా రావడం, ఒకరికి తెలియకుండా మరొకరు సినిమా తీయడం కొన్ని సందర్భాలో చూస్తుంటాం. ఇలా ఒకే స్టోరీ లైన్ తో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్టులో ‘టెంపర్’, ‘పటాస్’ సినిమాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇటివలే అలాంటి సీనే రిపీట్ అయింది. అవును ఒకే కథతో ఈ ఏడాది రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలే ‘వివాహ భోజనంబు’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. ఈ రెండు సినిమాలు లాక్ డౌన్ పెళ్లి అనే స్టోరీ లైన్ తో తెరకెక్కినవే.
మొదటి లాక్ డౌన్ లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి.లాక్ డౌన్ కారణంగా పెళ్లి అనంతరం పెళ్లి కొడుకు ఇంట్లో చాలా మంది బంధువులు లాక్ అవ్వడం అందులో ఓ ఫన్నీ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ తో కామెడీ సినిమా చేస్తే వర్కౌటవుతుందని భావించి హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి కమెడియన్ సత్యని పెట్టి ‘వివాహ భోజనంబు’ సినిమా చేశారు. దీనికి రామ్ అబ్బరాజు దర్శకుడు. తక్కువ బడ్జెట్ తో OTT కోసం తీసిన ఈ సినిమా హిట్ అనిపించుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన సినిమా సెకండాఫ్ సందీప్ కిషన్ కేరెక్టర్ ఎంట్రీ తర్వాత బోర్ కొట్టించింది. దీంతో ఈ సినిమాను OTT లో ఎక్కువ మంది చూడలేదు. పైగా సోనీ లీవ్ అనే ఫ్లాట్ ఫాం తెలుగు ఆడియన్స్ కి ఇంకా రీచ్ అవ్వకపోవడంతో వ్యూవర్ షిప్ అందుకోలేకపోయింది.
ఇప్పుడు విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కూడా ఇంచుమించు అదే కథతో తెరకెక్కింది. ఇందులో కూడా లాక్ డౌన్ పెళ్లి, బంధువులను ఇంట్లో పెట్టుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే ఇబ్బందులను చూపించారు. రెండు సినిమాల్లో కొన్ని సీన్స్ కూడా సిమిలర్ అనిపిస్తాయి. కాకపోతే ‘వివాహా భోజనంబు’ లో లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకొని ఓ మిడిల్ క్లాస్ పెళ్లి కొడుకు పడే ఇబ్బందులు చూపిస్తే , ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ లో పెళ్ళికి ముందే పెళ్లి కూతురు ఇంట్లో లాక్ అయి హీరోతో పాటు వారి ఫ్యామిలీ పడే ఇబ్బందులు చూపించారు. ఇక హీరోకి ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కానీ అబ్బాయి పడే భాదతో కామెడీ యాడ్ చేశారు. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా కథ -స్క్రీన్ ప్లే అందించగా విద్యా సాగర్ దర్శకత్వం వహించాడు.
ఇక ‘వివాహా భోజనంబు’ ముందే రిలీజయింది కాబట్టి ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కి సంబంధించి కొన్ని మార్పులు చేసుకొని ఉండొచ్చు కానీ స్టోరీ లైన్ మాత్రం ఒకటే. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు.
This post was last modified on May 10, 2022 10:33 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…