పాన్ ఇండియా సినిమాలపై దర్శకుడి సెటైర్

ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ భాషలో చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు పాన్ ఇండియా. రాజమౌళి ‘బాహుబలి’ఫ్రాంచైజీ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్ళి భారీ లెవెల్ లో మార్కెట్ చేసుకోవడంతో అక్కడి నుండి అందరూ పాన్ ఇండియా అంటూ అదే ఫాలో అవుతున్నారు. ఒకే టైంలో వేరు వేరు భాషల్లో ఒకే సారి తెరకెక్కితే దాన్ని పాన్ ఇండియా అంటారు. కానీ ఇప్పుడు డబ్బింగ్ సినిమాలను కూడా పాన్ ఇండియా అనేస్తున్నారు. ప్రస్తుతం ఈ వర్డ్ పెట్టుకోవడం ఫిలిం మేకర్స్ ప్యాషన్ అయిపోయింది. కమెడియన్స్ కూడా హీరోలుగా మారి పాన్ ఇండియా సినిమా అంటూ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారంటే ఈ పదం ఎంత చులకన అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే పాన్ ఇండియా సినిమాల మీద దర్శకుడు అనిల్ రావిపూడి ‘F3’ లో సెటైరికల్ కామెడీ ప్లాన్ చేశాడు. వెన్నెల కిషోర్ కేరెక్టర్ తో పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అంటూ చెప్పించాడు. ఆ డైలాగ్ ట్రైలర్ లో కట్ చేసి డైరెక్ట్ గా పాన్ ఇండియా సినిమాల మీద సెటైర్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు అనీల్. ట్రైలర్ లో వెన్నెల కిషోర్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. ఆ బిట్ కట్ చేసి పాన్ ఇండియా స్టార్స్ మీద కొందరు యాంటీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతూ వారి అభిమానులను రెచ్చగొడుతున్నారు.

అయితే అనిల్ రావిపూడి కరెక్ట్ ట్రెండ్ పట్టుకొని కామెడీ సన్నివేశాలు రాసుకోవడంలో దిట్ట. అందులో భాగంగానే ఆడియన్స్ ని నవ్వించడానికి ఈ సెటైరికల్ కామెడీ ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. మరి సినిమాలో పాన్ ఇండియా అంటూ వచ్చే కామెడీ పార్ట్ జస్ట్ లైటర్ వేలోనే ఉంటుందా ? లేదా కొందరు హీరోలపై సెటైర్ వేసినట్టు ఉంటుందా ? మరి చూడాలి అనిల్ దాన్ని ఎలా ట్రీట్ చేశాడో.