ఇప్పుడు కాస్త బయోపిక్ ల ఉధృతి తగ్గింది కానీ మహానటి సక్సెస్ అయ్యాక ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ప్రేక్షకులకు సైతం క్రమంగా ఇవి బోర్ కొట్టడం మొదలయ్యింది. అందుకే దర్శకులు స్పోర్ట్స్ డ్రామాలు, ఆత్మకథలకు బ్రేక్ ఇచ్చేశారు. అయినప్పటికీ తెలుగు తెరవేల్పులుగా కొలచబడ్డ స్టార్ హీరోల జీవితాలను తెరమీద చూపిస్తే బాగుంటుందన్న ఆలోచన కొందరికి లేకపోలేదు. కానీ బాలకృష్ణ ముచ్చట పడి తనే స్వయంగా నిర్మించి నటించిన ఎన్టీఆర్ ఫలితం చూశాంగా. కనీసం యావరేజ్ కాలేకపోయింది.
అభిమానులు ఆరాధించే కథానాయకులైనా వాళ్ళ లైఫ్ ని స్క్రీన్ మీద పండాలంటే డ్రామా అవసరం. అది లేనందుకే ఎన్టీఆర్ రెండు భాగాలకు ఆదరణ దక్కలేదు. ఏఎన్ఆర్ బయోపిక్ ఆలోచన గురించి గతంలో నాగార్జునని ప్రశ్నించినప్పుడు తాను అంత సాహసం చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇప్పుడు కృష్ణ గారి వంతు వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న ఇంటర్వ్యూలలో మహేష్ బాబు దగ్గర నాన్నగారి జీవితకథను తీస్తారా అనే ప్రశ్న వచ్చింది.
దానికి ప్రిన్స్ జవాబు చెబుతూ దేవుడి లాంటి ఆయన గురించి సినిమా తీసే ఆలోచన లేదని ఒకవేళ ఇంకెవరైనా ముందుకు వస్తే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాను తప్ప అందులో కృష్ణ గారి క్యారెక్టర్ వేయనని తేల్చి చెప్పేశారు. ఇది మంచి నిర్ణయమే. నటుడిగా దర్శక నిర్మాతగా ఎన్నో సాహసాలు చేసిన కృష్ణగారిని ఇంకొకరి రూపంలో చూడలేం. వారసుడైన మహేష్ అయినా సరే. అయినా మూడువందల పైచిలుకు సినిమాల గొప్ప ప్రస్థానమున్న సూపర్ స్టార్ కథను మూడు గంటల్లోనో రెండు భాగాల్లోనో చెప్పడం సాధ్యమా.
This post was last modified on May 10, 2022 10:47 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…