హీరో రిక్వెస్ట్ .. ఫస్ట్ లుక్ లేదు

సహజంగా హీరో పుట్టిన రోజు అంటే అతని సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పక్కా రిలీజ్ ఉంటుంది లేదా బర్త్ విషెస్ తో ఓ పోస్టర్ అయిన వదులుతారు. ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న సినిమా నుండి ఫస్ట్ లుక్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు కానీ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ ప్రొడక్షన్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసి షూటింగ్ కూడా మొదలైంది కదా లుక్ రిలీజ్ చేయొచ్చు కదా అంటూ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. నిజానికి ఇవ్వాళ VD11 కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఉన్నపళంగా ఆ ప్లాన్ మార్చుకొని డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది.

విషయం ఏమిటంటే… ఈరోజు టాలీవుడ్ నుండి చాలానే అప్ డేట్స్ ఉన్నాయి. F3 ట్రైలర్ తో పాటు మేజర్ ట్రైలర్ కూడా ఉంది. ఇక రానా , దుల్కర్ సినిమాల సాంగ్స్ రిలీజ్ కూడా ఇదే రోజు. ఇంకా కొన్ని అప్ డేట్స్ కూడా ఉన్నాయి. మరో వైపు చిరు , వెంకటేష్ క్లాసిక్ సినిమాల యానివర్సరి ట్రెండ్ తో ఫ్యాన్స్ బిజీ అయ్యారు. ఈ హడావుడిలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే అన్నిటిలో ఒకటిగా కలిసిపోతుందే తప్ప సెపరేట్ గా ఎటెన్షణ్ క్రియేట్ చేయడం కష్టమే. అందుకే హీరో విజయ్ దేవరకొండ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఇవ్వాళ ఫస్ట్ లుక్ రిలీజ్ వద్దని తర్వాత ఏదైనా మంచి డేట్ లో సెపరేట్ గా రిలీజ్ చేయమని చెప్పాడట. దీంతో మైత్రి నిర్మాతలు విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది.

ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ని మే 16 కి షిఫ్ట్ చేశారు నిర్మాతలు. ఆ రోజు సినిమా నుండి విజయ్ బెస్ట్ లుక్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. అదీ సంగతి ఇదంతా తెలియక ఫ్యాన్స్ ప్రొడక్షన్ పై సీరియస్ గా ఉన్నారు.