ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి సినిమా విడుదల తేదీ ప్రకటించాక దానికే నిర్మాతలు కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు. రకరకాల కారణాలు వాళ్ళను ప్రభావితం చేసి వాయిదా వేయించేలా చేస్తున్నాయి. ట్రిపులార్ అయినా అశోకవనమైనా ఎవరూ దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సైతం ఈ బెడద తప్పలేదు. ముందు జూలైలో అనుకున్న రిలీజ్ డేట్ కాకుండా ఆగస్ట్ 12 కి షిఫ్ట్ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ముందస్తుగా సమాచారం ఇచ్చారు.
కానీ ఇక్కడ రిస్క్ ఉంది. అదే రోజు ఏజెంట్ రంగంలో దిగుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అఖిల్ ని మాస్ కి దగ్గర చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. అంచనాలు మాములుగా లేవు. ఇదే చాలదనుకుంటే సమంతా యశోద కూడా 12నే వస్తోంది. అంటే ట్రయాంగిల్ వార్ తప్పదన్న మాట. అయితే ఏజెంట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక్కడితో క్లాష్ కథ అయిపోలేదు. ఒక రోజు ముందు 11న అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నాడు. ఇందులో నాగ చైతన్య ప్రత్యేక పాత్ర చేయడంతో తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో కాస్త లోతుగా ఆలోచిస్తే ఏజెంట్ తప్పుకోవాలని డిసైడ్ అయ్యాకే నితిన్ ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తోంది. ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి అప్పుడే నిర్ధారణకు రాలేం. మాచర్ల నియోజకవర్గంలో కృతి శెట్టి హీరోయిన్ కాగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.
This post was last modified on May 8, 2022 7:30 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…