Movie News

చిరంజీవిపై కోట తీవ్ర వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీతో ఎప్పుడు, ఎందుకు చెడిందో కానీ.. ఈ మధ్య లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఆ కుటుంబ వ్యక్తుల మీద మంటెత్తిపోతున్నారు. కొన్ని నెలల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా ఆయన నాగబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలే చేశారు. చిరంజీవిని కూడా కొన్ని విషయాల్లో తప్పుబట్టారు. ఇప్పుడు ఆయన చిరంజీవి మీద ఓ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇటీవల ‘మే డే’ ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి ప్రసంగం విషయంలో కోట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందులో చిరు మాట్లాడిన ఒక్కో మాటను పట్టుకుని విమర్శలు చేశారు. చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నట్లు చిరు చెప్పిన మంచి విషయం మీద కోట ఆ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ముందు కార్మికులకు తిండి పెట్టాలని.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారని కోట ప్రశ్నించారు. ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. వాళ్ల దగ్గర డబ్బులుంటే అపోలో ఆసుపత్రికి వెళ్తారు కానీ.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎందుకు వెళ్తారని శ్రీనివాసరావు అన్నారు. ఇక మే డే వేడుకల్లో భాగంగా తాను సినీ కళాకారుడిని కాదని, కార్మికుడినని చిరు వ్యాఖ్యానించడాన్ని కోట తప్పుబట్టారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. తనకు అలాంటి మాటలు నచ్చవని.. కానీ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని కోట పేర్కొనడం గమనార్హం.

ఇక చిరంజీవి సేవా భావం గురించి కోట వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కార్మికుడినని చెప్పుకుంటున్న చిరంజీవి ఎవరికైనా ఏనాడైనా రూపాయి సాయం చేశారా … ఆయన సినిమాల్లో ఎవరికైనా వేషాలు ఇప్పించారా అని కోట ప్రశ్నించారు. తన ఇంటికి సాయం కోసం వచ్చే వారికి 500, 1000 ఇచ్చి పంపుతుంటానని.. ఇలా ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కోసం రూ.5 లక్షల దాకా సాయం చేశానని.. అంతే కానీ నేను ఇది చేస్తా, అది చేస్తానని చెప్పనని కోట వ్యాఖ్యానించారు. గతంలో ‘మా’ కోసం కూడా విరాళాలు ఇచ్చానని, షుగర్ పేషెంటైన తాను తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం వృద్ధాప్యంలోనూ నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని కోటా గుర్తుచేశారు. అసందర్భంగా కోట ఇలా చిరును టార్గెట్ చేయడం చూస్తే ఆయనకు వ్యక్తిగతంగా ఏదైనా చెడిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

This post was last modified on May 8, 2022 11:07 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

4 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

7 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

9 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

10 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

10 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

11 hours ago