జై భీమ్ సినిమాపై నెలకొన్న ఓ చీకటి కోణం మళ్లీ వెలుగులోకి రావడంతో ఆ జంట మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దీంతో సూర్య ప్రతిష్ట మరింత మసకబారే విధంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా విచారణకు హాజరుకాని ఆ జంటను ఉద్దేశించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను ఆదేశించి.. నిర్ఘాంత పోయేలా చేసింది. ఆ వివరం ఈ కథనంలో..
ప్రముఖ స్టార్ సూర్య, జ్యోతిక జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. సూర్య నటించిన జై భీమ్ సినిమా విషయమై రేగిన వివాదం మళ్లీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వన్నియార్ చెందిన ప్రముఖులు ఈ సినిమా పై అభ్యంతరం తెలిపారు. అంతేకాదు గత ఏడాది జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని కోరింది. కానీ ఈ జంట కోర్టు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కోర్టుకు హాజరు కాలేదు.
ఈ విషయం పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు పై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ కు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ ఈ కేసును మే 20 వ తారీఖుకు వాయిదా వేసింది.
This post was last modified on May 7, 2022 10:28 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…