మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 నుండి మరో స్టిల్ లీకైంది. ప్రస్తుతం యూనిట్ వైజాగ్ లో చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తున్నారు. అక్కడ అవుట్ డోర్ లో షూట్ జరుగుతుండటంతో చాటునుండి అభిమానులు చరణ్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లీక్స్ కి కారణం అవుతున్నారు. ఈ లీకులపై టీం సీరియస్ గా ఉంది. అయినా కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాజాగా లీకైన స్టిల్ లో చరణ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తూ స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
సినిమాలో చరణ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్ ఉంది. అందులో ఒకటి స్టూడెంట్ లీడర్ కాగా మరొకటి ఫాదర్ రోల్. తండ్రి పాత్రకు సంబంధించి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఇటివలే రాజమండ్రి సమీపంలో తీశారు. అక్కడ అంజలి , చరణ్ మీద సీన్స్ తో పాటు ఓ సాంగ్ చిత్రీకరించారు. ప్రస్తుతం వైజాగ్ షెడ్యుల్ లో స్టూడెంట్ సీన్స్ తీస్తున్నారు. ఇప్పటికే రెండు లుక్స్ లీకైయ్యాయి. ఇక మూడో గెటప్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
వైజాగ్ నుండి టీం రాజమండ్రి వెళ్లనుంది. అక్కడ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. అవి ఫినిష్ చేసిన తర్వాత హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసి ఇక్కడ కొన్ని సీన్స్ తీస్తారని సమాచారం. అంజలి , శ్రీకాంత్ , సునీల్ ఇలా సినిమాలో భారీ కాస్టింగ్ పెట్టుకున్నాడు శంకర్. చరణ్ కి హీరోయిన్ గా కీయరా అద్వాని నటిస్తుంది.మొదటి సారి తను గురువుగా భావించే శంకర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు తమన్.
This post was last modified on May 7, 2022 10:14 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…