దక్షిణాదిన చాలా ఏళ్ల పాటు కథానాయికగా హవా సాగించింది తమన్నా భాటియా. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్లో చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాప్ స్టార్లందరితోనూ ఆమె సినిమాలు చేసింది. అలాగే తమిళంలో విజయ్, అజిత్, సూర్య, ధనుష్ లాంటి అగ్రశ్రేణి కథానాయకులతో నటించింది.
ఐతే తెలుగు, తమిళం కంటే ముందు తమన్నా తన మాతృభాష అయిన హిందీలోనే కథానాయికగా అరంగేట్రం చేసింది. కానీ ఆ సినిమా సరైన ఫలితాన్నివ్వలేదు. తర్వాత సౌత్‌కు వచ్చిన టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఐతే చాలామంది ముంబయి భామల్లాగే బాలీవుడ్లో పేరు సంపాదించాలని తమన్నాకు కూడా కోరిక ఉంది. కానీ ఆ కోరిక ఎంతకీ ఫలించడం లేదు. మధ్య మధ్యలో అవకాశం వచ్చినపుడల్లా హిందీలో సినిమాలు చేస్తోంది కానీ.. అవి నిరాశకే గురి చేస్తున్నాయి.
హిమ్మత్ వాలా, ఎంటర్టైన్మెంట్.. లాంటి డిజాస్టర్లు తమన్నాకు బాలీవుడ్ మీద ఆశలు లేకుండా చేశాయి. అయినా ఆమె మాత్రం ప్రయత్నం మానలేదు. ఇప్పుడు సౌత్‌లోనూ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో మళ్లీ బాలీవుడ్లో లాస్ట్ షాట్ ట్రై చేస్తోంది మిల్కీ బ్యూటీ. చాందిని బార్, ఫ్యాషన్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్‌తో ఆమె జట్టు కట్టింది. వీరి కలయికలో కొన్ని నెలల కిందట ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా మొదలైంది. మధుర్ మామూలుగా పరిమిత బడ్జెట్లో, చాలా తక్కువ రోజుల్లో సినిమా తీసేస్తుంటాడు. అతను ఎక్కువగా తీసేది కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే. ‘బబ్లీ బౌన్సర్’ కూడా అందుకు మినహాయింపు కాదు.
తమన్నా లీడ్ రోల్‌లో చాలా తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాడు మధుర్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి మధురే ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హిందీతో పాటు తమన్నా ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగు, తమిళంలోనూ విడుదల కాబోతోందట. మరి కెరీర్ చరమాంకంలో అయినా తమ్మూ తన మాతృభాషలో హిట్టు కొట్టి తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంటుందేమో చూడాలి.
This post was last modified on May 5, 2022 4:59 pm
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…