సర్కారు వారి పాట.. తెలుగులో రాబోతున్న తర్వాతి భారీ చిత్రం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా రిలీజైన ట్రైలర్.. ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. అది చాలదన్నట్లు ట్రైలర్ లాంచ్ సందర్భంగా పరశురామ్ అభిమానులతో మాట్లాడుతూ.. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుందని, ఇది తన ప్రామిస్ అని చెప్పి వారి ఉత్సాహాన్ని మరింత పెంచాడు.
ఇప్పటిదాకా సినిమా తీయడంలోనే బిజీగా ఉండి మీడియాలో పెద్దగా కనిపించని పరశురామ్ తాజాగా.. ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్కారు వారి పాట గురించి, అలాగే తన కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. మహేష్ లాంటి హీరో తాను కథ చెబుతానంటే వినడానికి వెంటనే ఒప్పుకోవడమే తాను సాధించిన విజయమని.. దాంతో తన టెన్షన్ అంతా తీరిపోయిందని.. గంట సేపు కథ చెప్పగానే మనం ఈ సినిమా చేస్తున్నాం అని మహేష్ చెయ్యి కలిపాడని పరశురామ్ వెల్లడించాడు.
మహేష్ పాత్ర లుక్ భిన్నంగా ఉండాలని, జులపాల జుట్టు, చెవిపోగు, మెడపై టాటూ లాంటి ఆలోచనలు తానే చెప్పానని.. తన అభిప్రాయాన్ని గౌరవించి మహేష్ అన్నిటికీ ఒప్పుకున్నాడని, రెండు నెలలు జుట్టు పెంచాడని పరశురామ్ తెలిపాడు. సర్కారు వారి పాట కథ గురించి మాట్లాడుతూ.. ఇది బ్యాంకు నేపథ్యంలో నడిచే కథే అయినా, బ్యాంకులో కుంభకోణాలు, అందులో జరిగే అంశాల ప్రస్తావన ఉండదని.. కానీ సామాన్య జనం ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక క్రమశిక్షణ లాంటి విషయాలపై చర్చ ఉంటుందని పరశురామ్ చెప్పాడు.
తాను మహేష్ నటించిన ఒక్కడు చూసే జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో సినీ రంగంలోకి అడుగు పెట్టి, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరినట్లు పరశురామ్ వెల్లడించాడు. తన తొలి చిత్రం యువత హిట్టయ్యాక ఫ్లాప్ వచ్చిందని, కెరీర్ ఒక దశ వరకు ఒడుదొడుకులతో సాగిందని, సారొచ్చారు సినిమా ఫ్లాపయ్యాక ఆ ప్రభావం నుంచి తేరుకోవడానికి రెండేళ్లు పట్టిందని.. అక్కడి నుంచి తన ప్రయాణం కొత్తగా మొదలైందని పరశురామ్ తెలిపాడు.
This post was last modified on May 3, 2022 2:51 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…