టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకున్న ఈ సినిమాతో ఎలాగైనా మెస్మరైజ్ చేయాలని చూస్తున్నాడు నాగ్. నిజానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత అక్కినేని నాగార్జున కి చెప్పుకునే రేంజ్ హిట్ పడలేదు.
ఇక బంగార్రాజు కూడా సంక్రాంతి సీజన్ లో ఓ నాలుగు రోజులు కలెక్షన్స్ రాబట్టింది కానీ లాంగ్ రన్ లో ఓ మోస్తారు వసూళ్ళు మాత్రమే అందుకుంది. ఇక కంటెంట్ పరంగానూ బంగార్రాజు పూర్ అనిపించింది. అక్కినేని అభిమానులు సైతం నాగ్ , చైతు నుండి బెస్ట్ ఆశిస్తే కళ్యాణ్ కృష్ణ వారిని కూడా సాటిస్ఫై చేయలేకపోయాడు.
ఇక బంగార్రాజు కంటే ముందు వచ్చిన ‘వైల్డ్ డాగ్’ గురించి చెప్పనక్కర్లేదు. సినిమా కంటెంట్ పరంగా ఒకే అనిపించుకుంది కానీ కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అనిపించుకుంది. OTT లో మాత్రం మంచి వ్యూస్ రాబట్టింది. దానికంటే ముందు రిలీజైన ‘మన్మథుడు 2’ ఇక చెప్పనక్కర్లేదు. మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకొని రెండో రోజుకే చతికల పడింది.
ఇలా నాగ్ నుండి కొన్నేళ్లుగా వచ్చిన సినిమాలు ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నాగ్ కూడా ‘ది ఘోస్ట్’ తో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. గతంలో ‘గరుడ వేగ’ సినిమాతో సీనియర్ హీరో రాజశేఖర్ ని బాగా హ్యాండిల్ చేసి ప్రశంసలు అందుకున్నాడు ప్రవీణ్ సత్తారు. మరి ఇప్పుడు నాగ్ కి సత్తారు అయిన ఆశించిన విజయం అందిస్తాడా లేదా చూడాలి.
This post was last modified on May 3, 2022 12:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…