Movie News

రాజ్ తరుణ్ కెరీర్ ఎందుకు దెబ్బ తిందంటే..

దర్శకుడు కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అనుకోకుండా హీరోగా మారి.. ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి కెరీర్ ఆరంభంలో మంచి డిమాండ్ తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్. మొదట్లో అతడి జోరు చూస్తే మంచి స్థాయికి వెళ్తాడని.. మీడియం రేంజ్ స్టార్‌గా స్థిరపడతాడని అంచనా వేశారు. అనిల్ సుంకర లాంటి పెద్ద నిర్మాత ఒకేసారి అతడితో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నాడంటే అప్పట్లో అతడి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కానీ హ్యాట్రిక్ హిట్ల తర్వాత రాజ్ కెరీర్లో పెద్ద సక్సెస్ ఒక్కటీ లేదు. ఆ మూడు విజయాల తర్వాత రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడతను. వాటిలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మినహాయిస్తే ఓ మోస్తరుగా ఆడిన సినిమాయే లేదు. చివరగా రాజ్ నుంచి వచ్చిన ‘స్టాండప్ రాహుల్’ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోయింది. మరి ఎంతో ఆశాజనకంగా కనిపించిన రాజ్ కెరీర్ ఇలా తయారవ్వడానికి కారణమేంటి? దీని గురించే అతడి మేనేజర్ అయిన సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

కెరీర్ ఆరంభంలో వరుస విజయాల తర్వాత రాజ్‌కు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చేశాయని.. అవన్నీ ఒప్పుకుని సినిమాలు చేసుకుంటూ పోయాడని.. ఈ క్రమంలో ఏ సినిమా వర్కవుట్ అవుతుంది, ఏది కాదు అని తాము చూసుకోలేదని రాజా రవీంద్ర చెప్పాడు. తమ జడ్జిమెంట్ గురించి ఆలోచించకుండా.. రాజ్‌తో సినిమాలు చేసిన వాళ్ల మీద నమ్మకంతో, హిట్లు వాటంతట అవే వస్తాయి, ఒకటి పోయినా ఇంకోటి ఆడుతుంది అన్న ధీమాతో ముందుకు వెళ్లిపోయామని రాజా రవీంద్ర చెప్పాడు.

కొన్ని సినిమాలు తనకు నచ్చకుండా రాజ్ చేశాడని.. అలాగే కొన్ని రాజ్‌కు నచ్చకుండా తాను ఓకే చేశానని.. ఇలా ఇద్దరం పొరబాట్లు చేశామని రాజా రవీంద్ర చెప్పాడు. మారుతి కథ అందించిన ‘రాజు గాడు’ లాంటి సినిమాలపై చాలా నమ్మకం పెట్టుకున్నా అవి ఫలితాన్నివ్వలేదన్నాడు. ట్యాక్సీవాలా, శతమానం భవతి లాంటి చిత్రాల కథలు ముందు రాజ్ దగ్గరికే వచ్చాయని.. కొన్ని కారణాల వల్ల వాటిని రాజ్ చేయలేకపోయాడని.. అవి పెద్ద హిట్టయ్యాయని.. అలాగని రాజ్ చేస్తే ఆ సినిమాలు అంతే బాగా ఆడేవని కూడా చెప్పలేమని.. అలాగే రాజ్ వదులుకున్న సినిమాల్లో ఫ్లాప్ అయినవీ ఉన్నాయని రాజా రవీంద్ర వివరించాడు. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో రాజ్ ఓ సినిమా చేస్తున్నాడని.. ఇది కాకుండా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయని రాజా రవీంద్ర చెప్పడం విశేషం.

This post was last modified on May 2, 2022 5:47 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago