‘ఆచార్య’ సినిమా ఫలితం దాదాపుగా తేలిపోయినట్లే. ఎంతైనా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కాబట్టి వీకెండ్ వరకు వసూళ్లు బాగానే ఉంటాయి. ఆ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్నదే డౌటు. కంటెంట్ పరంగా అయితే ఈ చిత్రం సగటు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మెగా అభిమానులు సైతం అసంతృప్తితోనే ఉన్నారు. ఐతే సినిమా చూసిన నిరాశ చెందిన వాళ్లంతా దర్శకుడు కొరటాల మీద పడిపోతున్నారు.
నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన పేరు ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతూ వస్తోంది. కొరటాల ఎన్నడూ లేని విధంగా, తొలిసారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక దర్శకుడి మీద ఈ స్థాయిలో దాడి జరగడం అరుదు. ఒక సినిమా ఫలితానికి ప్రధాన బాధ్యత దర్శకుడిదే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో పూర్తిగా దర్శకుడినే బాధ్యుడిని చేయడం కూడా కరెక్ట్ కాదు.
అందులోనూ చిరంజీవి సినిమాకు కేవలం దర్శకుడిని బాధ్యుడిని చేయలేం.చిరంజీవి అనుభవం అలాంటిలాంటిది కాదు. 150కి పైగా సినిమాలు చేసి, తెలుగు సినీ చరిత్రలో ఇంకెవ్వరూ చూడని బ్లాక్‌బస్టర్లు కొట్టిన ఘన చరిత్ర ఆయన సొంతం. ఇదంతా ఎవరో చెప్పింది చేసుకుపోతుంటే వచ్చిన సక్సెస్ కాదు. ఆయనకొక జడ్జిమెంట్ ఉంది. ఆ విషయంలో అందరూ ఆయన్ని కొనియాడుతారు. చిరు కూడా తనకు తానుగా తన జడ్జిమెంట్ స్కిల్స్ గురించి సందర్భం వచ్చినపుడల్లా చెప్పుకుంటూ ఉంటారు.
చిరు తన ప్రతి సినిమాకూ ఎడిటర్ అవతారం ఎత్తుతాడని.. చరణ్ సినిమాలకు కూడా రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించడం లాంటివి చేస్తారని అంటారు. ఇక స్క్రిప్టును కూడా ఒక పట్టాన ఓకే చేయరని, ఆయన ఆమోద ముద్ర వేస్తే మినిమం గ్యారెంటీ అవుతుందనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీ జనాల్లో ఉంది. ఇక షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో చిరు జోక్యం ఉంటుందని కూడా చెబుతారు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డున్న వ్యక్తి ‘ఆచార్య’లో ఏ జోక్యం లేకుండా పూర్తిగా కొరటాలకే వదిలేశారా.. ఈ ఫెయిల్యూర్ విషయంలో ఆయన బాధ్యత లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు చిరును తిట్టాలి, నిందించాలి అని కాదు కానీ.. కేవలం కొరటాలన ఈ స్థాయిలో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నది అందరూ గుర్తించాల్సిన విషయం.
This post was last modified on May 1, 2022 8:51 am
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…