మెగా స్టార్ చిరంజీవి సినిమా అంటే పది రోజుల ముందు నుండి ఫ్యాన్స్ హంగామా మొదలవుతుంది. ఎక్కడ చూసినా చిరు నామ జపమే వినిపిస్తుంది. కానీ ఈసారి అలా జరగలేదు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ తర్వాత వస్తున్నందుకో ఏమో కానీ ‘ఆచార్య’ కి ఊహించినంత బజ్ లేదు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మాత్రమే కొంత హడావుడి చేస్తున్నారు తప్ప మూవీ లవర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అయితే ఇదంతా పక్కన పెడితే అసలు మెగా మూవీకి బెన్ఫిట్ షోలు ఉన్నాయా ? లేవా ? అనేది క్లారిటీ లేదు. నిన్న హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో 3:30 నుండి 4 గంటల మధ్య ‘ఆచార్య’ ఫ్యాన్స్ షోల టికెట్లు కొన్ని అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాంటి పర్మిషన్ లేదనే టాక్ వినబడుతుంది. ఇక బెన్ ఫిట్ షో అంటే రెండ్రోజుల ముందు నుండి హంగామా ఉంటుంది.
కానీ ఆచార్యకి అలాంటిదేం లేదు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ షో టికెట్లతో సందడి కనిపించడం లేదు. ఇక సినిమా మీద ఆశించిన స్తాయి బజ్ లేకపోవడం, బుకింగ్స్ కూడా స్లోగా ఉండటంతో ఫ్యాన్స్ కూడా డేర్ చేసి స్పెషల్ షోలు ప్లాన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ ప్రభుత్వం నుండి పర్మిషన్ వచ్చినా ఎవరూ షోలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళడం లేదని తెలుస్తుంది.
ఏదేమైనా ‘ఆచార్య’ ఫ్యాన్స్ షో కి సంబంధించి అటు ఆంధ్రాలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో 6:30 నుండి 7 గంటల లోపు మార్నింగ్ షో పడనుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పటికే ఈ షోలకు సంబంధించి టికెట్లు సెల్ అయిపోయాయి కూడా. మరి బెన్ఫిట్ షో ఉంటుందా? లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
This post was last modified on April 28, 2022 9:17 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…