1997లో ‘టైటానిక్’ సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచ బాక్సాఫీస్‌ను ఆ చిత్రంతో షేక్ చేశాక ఆయన నుంచి ఇంకో 12 ఏళ్ల పాటు ఏ సినిమా రాలేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడమేంటి అంటూ మధ్యలో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ‘అవతార్’ అనే సినిమా తీస్తున్నాడని తెలిసి.. మరీ ఇన్నేళ్లు ఒక సినిమా మీద పని చేయడం ఏంటి అని విడ్డూరంగా చూశారు.
కట్ చేస్తే.. 2009లో విడుదలైన ‘అవతార్’ ప్రపంచ సినిమా రికార్డులన్నీ బద్దలుకొట్టేస్తూ అనితర సాధ్యమైన విజయాన్నందుకుంది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కలిగించిన అనుభూతి గురించి, బాక్సాఫీస్ దగ్గర దాని సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.
ఐతే ఇక తన కెరీర్‌ను పూర్తిగా ‘అవతార్’కే అంకితం చేస్తూ ఈ సిరీస్‌లో ఇంకో మూడు నాలుగు సినిమాలు తీయడానికి ప్రణాళికలు రచించుకున్నాడు కామెరూన్. ముందుగా ‘అవతార్-2’ ఈ ఏడాది డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అవతార్’ రిలీజైన 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజవుతుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు.
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’.. ఇదీ పార్ట్-2 టైటిల్. కామెరూన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డిస్నీ సంస్థ లాస్ వెగాస్‌లో ‘అవతార్-2’కు సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. పండోరా పర్వతాల మీద హీరోలు విహరించే రెండు సన్నివేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారట. ఈ ప్రదర్శన జరిగిన థియేటర్లోకి మొబైళ్లు, కెమెరాలు అనుమతించలేదు.
దీంతో లీక్డ్ వీడియోలేవీ బయటికి రాలేదు. కాగా మే 6న ‘అవతార్-2’ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడైంది. అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ‘అవతార్-2’ను డిసెంబరు 22న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఒక సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కావడం అన్నది ఊహకు కూడా అందని విషయం. మొత్తానికి కామెరూన్ ‘అవతార్-2’ ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 28, 2022 11:02 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…