ఇటీవలే ఈగ విలన్ కం శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ ఇకపై జాతీయ బాష కాదని చేసిన కామెంట్స్ మెల్లగా పెను దుమారానికి దారి తీస్తున్నాయి. అతని ఉద్దేశం ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్యాన్ ఇండియా మూవీస్ గురించి మాట్లాడుతూ అన్న సుదీప్ వ్యాఖ్యలు అభిమానుల్లోనూ గందరగోళానికి దారి తీశాయి.
కెజిఎఫ్ 2 సక్సెస్ తర్వాత కన్నడ హీరోల ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందని నార్త్ మూవీ లవర్స్ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. తాజాగా దీని గురించి అజయ్ దేవగన్ స్పందించాడు. సుదీప్ ని తమ్ముడని సంబోధిస్తూనే ఒకవేళ హిందీ జాతీయ బాష కానప్పుడు తమరి కన్నడ సినిమాలను డబ్బింగ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నారని నేరుగా ప్రశ్నించాడు. హిందీ అప్పటికీ ఎప్పటికీ జాతీయ బాషగానే నిలిచి ఉంటుందని కౌంటర్ ఇచ్చాడు.
దీనికి సుదీప్ ఇంకా బదులు చెప్పలేదు కానీ ట్వీట్ కింద కామెంట్స్ లో ఫ్యాన్ వార్ మొదలైపోయింది. సుదీప్ అన్నదాంట్లో తప్పేముందని ఒక వర్గం, హిందీని అవమానిస్తారా అంటూ మరో వర్గం చీలిపోయాయి. ఇప్పుడిది కార్చిచ్చులా పాకి సెలబ్రిటీలు కనక అజయ్ దేవగన్ తరహాలో స్పందిస్తే సుదీప్ రాబోయే ప్యాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోనాకు చిక్కులు తప్పవు.
దీంతోనే ఇతను మొదటిసారి బాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నాడు. అసలే సౌత్ నార్త్ సినిమా మీద ఎప్పటి నుంచో విభజన గురించిన వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. మధ్యలో ఇలాంటివి కొత్త అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. మరి సుదీప్ హుందాగా స్పందించి తన ఉద్దేశాన్ని వివరించి సారీ చెబుతాడా లేక ధీటుగా బదులిస్తాడా లెట్ వెయిట్ అండ్ సి
This post was last modified on April 27, 2022 6:06 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…