కొన్నేళ్ల నుంచి నార్త్ ఇండియాలో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ‘బాహుబలి’తో మొదలైన ఈ ఒరవడి ఇప్పుడు బాగా ఊపందుకుంది. చాపకింద నీరులా ఆ మార్కెట్‌ను మన సినిమాలు కబళించేస్తున్నాయి. క్లాస్‌గా, ఇంటలిజెంట్‌గా సినిమాలు తీసుకుంటూ.. ఉత్తరాదిన మాస్ ప్రేక్షకులకు క్రమ క్రమంగా దూరం అయిపోయారు బాలీవుడ్ జనాలు. అదే సమయంలో దక్షిణాది నుంచి వచ్చిన భారీ, మాస్, యాక్షన్ సినిమాలకు యూట్యూబ్‌లో, టీవీ ఛానెళ్లలో బాగా అలవాటు పడ్డ జనాలు.. థియేటర్లలోనూ ఇక్కడి చిత్రాలను ఆదరించడం మొదలుపెట్టారు.
‘బాహుబలి’ నుంచి సౌత్ సినిమాల హవా మొదలైంది హిందీ మార్కెట్లో. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలతో నార్త్‌లో సౌత్ ఆధిపత్యం మరో స్థాయికి చేరింది. ఇలాంటి టైంలో దక్షిణాది సినిమాలకు దీటుగా భారీతనం, యాక్షన్, మాస్ అంశాలతో సినిమాలు తీయాల్సింది పోయి.. బాలీవుడ్ వాళ్లు తిరోగమనంలో పయనిస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకులను తమ వైపు మళ్లించడానికి సొంతంగా ఏం చేయాలో చూడకుండా సౌత్ సినిమాలను రీమేక్ చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు అక్కడి హీరోలు, ఫిలిం మేకర్లు.
తమ ప్రేక్షకులు దక్షిణాది చిత్రాలను ఓటీటీల్లో ఆల్రెడీ బాగా చూస్తున్నారని తెలిసి కూడా మళ్లీ వాటిని రీమేక్ చేయడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. అక్షయ్ కుమార్ తాజాగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్ర రీమేక్‌ను మొదలుపెట్టడం తెలిసిందే. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజైంది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్‌లో విడుదల చేశారీ చిత్రాన్ని. ఉత్తరాది జనాలు కూడా ఈ సినిమాను బాగానే చూసి ఉంటారు.
ఈ మధ్యే రిలీజైన ‘జెర్సీ’కి ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురవడానికి కారణం.. నాని నటించిన ఒరిజినల్‌ను ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ చూసి ఉండడమే. ఇక అక్షయ్ చివరి సినిమా ‘బచ్చన్ పాండే’ సరిగా ఆడకపోవడానికి కూడా ఇలాంటి కారణమే ఉంది. దాని ఒరిజినల్ ‘జిగర్ తండ’, తెలుగు రీమేక్ ‘గద్దలకొండ గణేష్’ను ఓటీటీల్లో జనాలు బాగా చూశారు. దీంతో హిందీ వెర్షన్ ఆడలేదు. ఇలాంటి అనుభవాలు చూసి కూడా మళ్లీ ‘ఆకాశం నీ హద్దురా’ను హిందీలో రీమేక్ చేయాలనుకోవడం విడ్డూరం కాక మరేంటి?
This post was last modified on April 27, 2022 5:56 pm
వైసీపీ కీలక నేత, లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని…
డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో రెడీ అవుతున్నాడు. విడుదల తేదీ…
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్ని నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించి ఏపీ…
తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం.. ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కొత్తగా అనిపించే కాన్సెప్ట్‌తో 34…
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటిసారి జపాన్ దేశానికి వెళ్లి ప్రత్యేకంగా ప్రమోట్ చేసిన దేవర మొన్న మార్చి 28…