బాలీవుడ్ ప్రస్తుతం విచిత్రమైన సంకటంలో పడింది. డిసెంబర్ నుంచి ఏకధాటిగా సౌత్ సినిమాల డామినేషన్ పెరిగిపోవడంతో వాటిని ఎలా ఎదురుకోవాలో అర్థం కాక అయోమయంలో చిక్కుకుంది. పుష్ప పార్ట్ 1, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 మూడూ ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అన్నీ డబ్బింగ్ వెర్షన్లే. జెర్సీలాంటి ఖరీదైన రీమేక్ కు దారుణ పరాజయం దక్కింది.
బచ్చన్ పాండే అయితే మరీ ఘోరం. భారీ నష్టాలు వచ్చాయి. క్లాసిక్ ని చెడగొట్టినందుకు అక్షయ్ కుమార్ ని నెటిజెన్లు దుమ్మెత్తిపోశారు. ఎల్లుండి రెండు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మొదటిది రన్ వే 34. అజయ్ దేవగన్ – అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఆశించిన బజ్ లేదు. అసలు విడుదలవుతుందా లేదానే అనుమానాలు లేకపోలేదు.
ముంబై ఢిల్లీతో సహా ఎక్కడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు. అలా అని పోస్ట్ పోన్ ప్రకటన రాలేదు. కెజిఎఫ్ 2 తాకిడి ఇంకా బలంగా ఉన్న నేపథ్యంలో దాన్ని తీసేందుకు ఎగ్జిబిటర్లు ఇష్టపడటం లేదు. రన్ వే 34 క్లాస్ గా సాగే యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇలా జరగడం అనూహ్యం.
రెండోది హీరోపంటి 2. ఫిజిక్స్ నే ఛాలెంజ్ చేసే అర్థం లేని హీరోయిజంతో మాస్ ని బాగా ఆకట్టుకునే టైగర్ శ్రోఫ్ హీరోగా రూపొందిన సినిమా ఇది. దీనికీ బజ్ అంతంత మాత్రంగా ఉంది. ట్రెండ్ గమనిస్తే నలభై శాతానికి మించి బుకింగ్స్ కనిపించడం లేదు. ఇదంతా విజువల్ గ్రాండియర్ల ప్రభావమేనని, భారీ స్కేల్ ఉంటే తప్ప థియేటర్లకు వచ్చేందుకు జనం ఇష్టపడటం లేదని, ఇది సర్దుకోవడానికి కొంత టైం పడుతుందని విశ్లేషకుల అంచనా. ఏమైనా ఇంత పెద్ద సినిమాలు వస్తున్నా సౌండ్ లేకపోవడం విచిత్రమే
This post was last modified on April 27, 2022 2:46 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…