ఎంత కాదనుకున్నా బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా పెద్ద సినిమాలు విడుదల చేయడం నిర్మాతలకు సవాల్ గా మారింది. అయినా కూడా తప్పడం లేదు. కరోనా ప్లస్ లాక్ డౌన్ వాయిదాల వల్ల ఇన్నేళ్లు ఆగుతూ వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా అడవి శేష్ మేజర్ కూడా డేట్ మార్చుకుంది.
ముందు అనుకున్న మే 27 కాకుండా వారం వాయిదా తీసుకుని జూన్ 3కి షిఫ్ట్ అయ్యింది. ఎఫ్3 కూడా మే 27నే రానుండటంతో ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఉండదు. అలా అని మేజర్ కు ఎలాంటి థ్రెట్ లేదని కాదు. జూన్ 3న అంతకు మించి అనేలా పోటీ ఉంది. కమల్ హాసన్ విక్రమ్ అదే రోజు రానుంది.
విజయ్ సేతుపతి – ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ తో పాటు మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో అంచనాలు మాములుగా లేవు. ముఖ్యంగా కేరళ తమిళనాడులో మేజర్ కు విక్రమ్ నుంచి స్క్రీన్ల పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ సైతం జూన్ 3నే లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు.
ప్రతిష్టాత్మక యాష్ రాజ్ సంస్థ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేస్తారు. ఈ నేపథ్యంలో మేజర్ ఈ రెండు సినిమాలను ఫేస్ చేయడం అంత సులభం కాదు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన మేజర్ ని సోనీతో భాగస్వామ్యంలో మహేష్ బాబు నిర్మించారు. అంచనాలైతే బాగున్నాయి కానీ విక్రమ్, పృథ్విరాజ్ లతో తలపడి ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. మొత్తానికి అంతుచిక్కని రీతిలో పోస్ట్ పోన్ల సమీకరణాలు మారుతున్నాయి.
This post was last modified on April 27, 2022 1:40 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…