అసలెలాంటి అంచనాలు లేకుండా తక్కువ థియేటర్లలో విడుదలై కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక హిందీ సినిమా దానికి పది రెట్లు ఎక్కువ వసూలు చేయడమనేది ఎవరి ఊహకు అందనిది. స్టార్స్ లేని చిన్న బాలీవుడ్ మూవీ మూడు వందల కోట్లకు దగ్గరగా వెళ్లడమనేది చరిత్రలో అరుదుగా జరుగుతుంది. దాన్ని చేసి చూపించిన ఘనత ది కాశ్మీర్ ఫైల్స్ కి దక్కుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో మూడు వారాలకు పైగా హౌస్ ఫుల్ బోర్డులతో భారీ కలెక్షన్లు రాబట్టడం చిన్న విషయం కాదు.
ఇప్పుడీ సెన్సేషనల్ మూవీ ఓటిటిలో రాబోతోంది. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. మాములుగా ఎంత పెద్ద సినిమాకైనా సరే థియేటర్ కు డిజిటల్ కు మధ్య గ్యాప్ చాలా తగ్గిపోయింది. రాధే శ్యామ్ 20 రోజులకు, భీమ్లా నాయక్ 30 రోజులకు ఓటిటిలో వదిలేశారు. కెజిఎఫ్ 2 కూడా ఫిఫ్టీ డేస్ మార్కుకు ముందుగానే ప్రైమ్ లో వచ్చేస్తుందనే ప్రచారం ఉంది. అలాంటిది ది కాశ్మీర్ ఫైల్స్ 60 రోజుల తర్వాత రావడమంటే ముమ్మాటికీ అచీవ్ మెంటే. జీ 5లో మే 13న దీన్ని వరల్డ్ ప్రీమియర్ చేయబోతున్నారు.
దీన్ని మిస్ చేసుకున్న రీజనల్ ఆడియన్స్ చాలా ఉన్నారు. వాళ్ళ కోసం తెలుగు తదితర భాషల్లో డబ్బింగ్ చేసి అందించబోతోంది జీ5. ఇది ఖచ్చితంగా రీచ్ పెంచే స్ట్రాటజీనే. కొత్త సినిమాల పోటీ విషయంలో వెనుకబడినట్టుగా కనిపించిన ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ది కాశ్మీర్ ఫైల్స్ లో ఉన్న హిందూ ఎమోషనల్ కనెక్షన్ లక్షల్లో కొత్త సబ్ స్క్రైబర్స్ ని తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది. వ్యూస్ పరంగా కనివిని ఎరుగని రికార్డులు సృష్టించడం ఖాయమని డిజిటల్ వర్గాల అంచనా. చూడాలి మరి స్మార్ట్ స్క్రీన్ పై ఇంకెన్ని సంచలనాలు రేపనుందో
This post was last modified on April 26, 2022 1:59 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…