బాహుబాలి ఫ్రాంచైజీ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు అందుకున్నాడు రాజమౌళి. అందుకే వేదికలపై కనిపించగానే ప్రతీ వారు జక్కన్న ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ రాజమౌళి చుట్టూ మాత్రం ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఎప్పుడూ వైఫై లా తిరుగుతూ ఇబ్బంది పెడుతుంటుంది. అదే రాజమౌళి హీరో సెంటిమెంట్. రాజమౌళి తో సినిమా చేశాక ఆ హీరో నెక్స్ట్ సినిమాలతో హిట్ కొట్టడం కష్టమనేది దీని సారాంశం.
‘బాహుబాలి 2’ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇటివలే ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవినే రాజమౌళి సెంటిమెంట్ ని మళ్ళీ గుర్తుచేసి దీన్ని రామ్ చరణ్ ‘ఆచార్య’ తో బ్రేక్ చేస్తాడని గట్టిగా చెప్పాడు. చిరు అలా అంటున్న టైంలో రాజమౌళి కాస్త దిగులుగా ఉండిపోయాడు. అంటే రాజమౌళి తనకి ఉన్న ఈ రిమార్క్ ని రిగ్రేట్ గా ఫీలవుతున్నాడనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది.
రామ్ చరణ్ కి కూడా గతంలో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ తగిలింది. ‘మగధీర’ తో రికార్డులు తిరగరాసిన చరణ్ ఆ వెంటనే ‘ఆరెంజ్’ తో డిజాస్టర్ చవి చూశాడు. మరి ఇన్నేళ్ళకి మళ్ళీ రాజమౌళితో సినిమా చేసిన చరణ్ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి రాజమౌళి హీరోగా హిట్టు కొడతాడా ? లేదా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏదేమైనా దర్శకుడిగా ఎంత ఎత్తు ఎదిగినా రాజమౌళి ని ఈ సెంటిమెంట్ మాత్రం వేధిస్తూ ఉంటుంది. మరి ఆచార్య దీనికి బ్రేక్ వేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొడితే దీన్ని ఉదాహరణగా చెప్పుకొని రాజమౌళి తనకున్న రిగ్రేట్ ని చేరిపేసుకుంటాడు. మరో నాలుగు రోజుల్లో ఈ విషయం తేలిపోతుంది. ఏప్రిల్ 29న రాజమౌళి సెంటిమెంట్ కి ఆచార్య తో ఫులి స్టాప్ పడనుందేమో చూడాలి.
This post was last modified on April 26, 2022 11:09 am
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…