బంగార్రాజు తర్వాత రావాల్సిన చైతు కొత్త సినిమా థ్యాంక్ యు విడుదల కోసం అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. నిర్మాత దిల్ రాజు సైతం మౌనంగానే ఉన్నారు. మనం తర్వాత చైతుతో దర్శకుడు విక్రమ్ కుమార్ రెండోసారి చేస్తున్న మూవీ ఇదే.
రాశిఖన్నా హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. ఇంతకు మించి ఎలాంటి సమాచారం లేదు. నిజానికి ముందు జూలైలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఈలోగా ఆ నెల మొత్తం ఇతర సినిమాలు లాక్ చేసుకున్నాయి. 1న పక్కా కమర్షియల్ – రంగ రంగ వైభవంగా వస్తున్నాయి.
8న నితిన్ మాచర్ల నియోజకవర్గం దిగుతుంది. 14న రామ్ ది వారియర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. 22న కార్తికేయ 2, 28న సుదీప్ విక్రాంత్ రోనా విడుదలవుతున్నాయి. వీటితో దేంతో పోటీపడినా రిస్క్ లేదు కానీ దానికి ముందసలు థ్యాంక్ యు టీమ్ రెడీగా ఉందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మే నెలలో ఎలాగూ ఛాన్స్ లేదు. జూన్లో మొదటి మూడు వారాలు విక్రమ్, అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ పలకరిస్తాయి. నాలుగో వారం ఖాళీగా ఉంది. పోనీ దాన్ని వాడుకుందాం అంటే ప్రమోషన్ ని ఇప్పటినుంచే మెల్లగా మొదలుపెట్టాలి. కానీ ఆ సూచనలైతే ప్రస్తుతానికి లేవు. ఏకంగా ఆగస్ట్ కి వెళ్లిపోయారా లేదా అంతకన్నా లేటా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతు విక్రమ్ కుమార్ ఇద్దరూ వెబ్ సిరీస్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. దీనికి దూత అనే టైటిల్ ను లాక్ చేశారు.
This post was last modified on April 22, 2022 2:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…