Movie News

చరణ్ మరిచిపోలేని 18 రోజులు

మెగాస్టార్ చిరంజీవితో ఆయన తనయుడు రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఇంకో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చరణ్.. తన తండ్రితో కలిసి నటించిన అరుదైన అనుభవం గురించి మాట్లాడాడు. కొన్నేళ్ల నుంచి ఒకే ఇంట్లో కలిసి లేకపోవడం వల్ల తన తండ్రిని చాలా మిస్ అవుతున్నానని.. ఐతే ‘ఆచార్య’ కారణంగా ఇద్దరం చాలా కాలం తర్వాత ఒకే ఇంట్లో వరుసగా 18 రోజులు ఉన్నామని.. ఆ 18 రోజులు తనకు మరపురానివని చరణ్ వెల్లడించాడు. 

దీని గురించి చరణ్ మరింత వివరిస్తూ.. ‘‘ఇంటి నిర్మాణ పనుల వల్ల గత నాలుగేళ్లుగా నేను, నాన్న దూరంగా ఉంటున్నాం. వీకెండ్స్‌లో, అప్పుడప్పుడూ కలుస్తుంటాం కానీ.. ఇంతకుముందులా ఒకే చోట కలిసి లేమన్న వెలితి ఉండేది. ఇలాంటి సమయంలో ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం నేను, నాన్న మాత్రమే ఒకే కాటేజీలో 18 రోజులు ఉండే అవకాశం వచ్చింది. అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశం కోసం మేమిద్దరం ఒక కాటేజీలో ఉన్నాం.

అప్పుడు రోజూ ఇద్దరం ఒకేసారి నిద్ర లేవడం.. వర్కవుట్లు చేయడం.. బ్రేక్ ఫాస్ట్ చేయడం.. షూటింగ్‌కు వెళ్లి పని పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి కాటేజీకి రావడం కబుర్లు చెప్పుకుని, భోజనం చేసి పడుకోవడం.. ఇలా 18 రోజులు ఒకేలా సాగాయి. ఆ మధుర క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను.

మధ్యలో నాన్న ఒక రోజు నా దగ్గరికి వచ్చి.. ‘చరణ్.. పనిలో బిజీగా ఉండడం వల్ల మనిద్దరం ఇలా కలిసి ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు. నేను కూడా నీకోసం ఇంత సమయాన్ని మళ్లీ ఎప్పుడు కేటాయించగలనో తెలియదు. ఆచార్య వల్ల మనకీ అవకాశం వచ్చింది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేద్దాం’ అని చెప్పారు. ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను సరే అని చెప్పా. అనుకున్నట్లే ఆ 18 రోజుల్ని మేం చాలా ఎంజాయ్ చేశాం’’ అని చరణ్ వివరించాడు.

This post was last modified on April 21, 2022 10:49 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

6 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

6 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

6 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago