తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌లను ఫుల్ లెంగ్త్ సినిమాలో చూడబోతున్నాం. వీరి కలయికలో తెరకెక్కిన ఆచార్య ఇంకో ఎనిమిది రోజుల్లోనే థియేటర్లలోకి దిగబోతోంది. వీరి కలయికలో సినిమా కోసం అభిమానులే కాదు.. మెగా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ తండ్రీకొడుకులను చూడటానికి ఆ కుటుంబంలోని అందరూ కూడా ఎగ్జైట్మెంట్‌తో ఉంటారనడంలో సందేహం లేదు.
ఐతే ఈ సినిమాను తాను కచ్చితంగా ఓ వ్యక్తితో కలిసి చూడాలని అంటున్నాడు చరణ్. ఆ వ్యక్తి చరణ్ నానమ్మ, చిరంజీవి తల్లి అంజనా దేవి కావడం విశేషం. ఆచార్య దర్శకుడు కొరటాల శివతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ ఈ కోరికను వెల్లడించాడు. ఆచార్య సినిమాను తాను, తన తల్లిదండ్రులు, అలాగే తన నానమ్మ అంజనా దేవితో కలిసి చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చరణ్ చెప్పాడు.
అప్పుడు నా కొడుకు ఎలా చేశాడో చూశావా అంటూ తన నానమ్మ, తన తల్లిని కవ్విస్తుందని.. ఆ దృశ్యం చూడాలని కోరుకుంటున్నానని చరణ్ అన్నాడు. ఈ సినిమాలో తాను, తన తండ్రి కలిసి డ్యాన్స్ చేసిన బంజారా పాట చిత్రీకరణకు వాళ్లిద్దరూ హాజరయ్యారని.. అప్పుడు కూడా నా కొడుకు బాగా చేశాడంటే నా కొడుకు బాగా చేశాడని ఇద్దరూ వాదించుకున్నారని చరణ్ చెప్పడం విశేషం.
ఇక తాను, నాన్న కలిసి సినిమా చేస్తే చూడాలని అత్యంత ఆశపడింది తన తల్లే అని.. ఆమె కోరిక నెరవేర్చడానికే తామిద్దరం ఆచార్య సినిమాలో కలిసి నటించామని చరణ్ తెలిపాడు. చిరు సరసన కాజల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించిన ఆచార్య ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 21, 2022 11:54 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…