వేరే భాషల్లో కొత్తగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులెవరైనా కనిపిస్తే వెంటనే తెలుగు దర్శకుల కళ్లు వారి మీద పడిపోతుంటాయి. సాధ్యమైనంత త్వరగా వాళ్లను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులోనూ సంగీత పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే దర్శకులు.. దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీల మీదా ఓ కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా తమిళం, మలయాళం నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే.
గతంతో పోలిస్తే మలయాళం నుంచి తెలుగులోకి ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకులు వస్తున్నారు. గోపీసుందర్, జేక్స్ బిజోయ్, గోవింద్ వసంత.. ఈ కోవలోని వారే. ఇప్పుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ అనే మరో మంచి సంగీత దర్శకుడు తెలుగులోకి అడుగు పెడతున్నాడు.
హృదయం.. ఈ ఏడాది మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శిన, దర్శన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్ తరహాలో సాగుతూ యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు హేషమ్ అబ్దుల్. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతడి కోసం ఆరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు నుంచి ఓ పేరున్న సినిమాకు అతను సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.
ఆ చిత్రమే.. ఖుషి. ఈ టైటిల్‌తో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌కు వెళ్లనుంది. ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు హేషమ్‌ను ఎంచుకున్నారు. అతడి నుంచి ఈ సినిమాలో మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ రాబోతున్నట్లే.
This post was last modified on April 21, 2022 10:04 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…