కేఆర్‌కే.. విడమరిచి చెబితే కణ్మణి రాంబో ఖటీజా. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి, సమంతల కలయికలో నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ రూపొందించిన చిత్రమిది. నయన్, సేతుపతి, సామ్‌ల కాంబినేషన్లో సినిమా అనగానే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇక ఇదొక టిపికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కడం, దీని ప్రోమోలు ఇంకా క్యూరియాసిటీని పెంచాయి.
తెలుగు వరకు చూస్తే.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సమంతనే అనడంలో సందేహం లేదు. పెళ్లవడానికి ముందు, తర్వాత ట్రెడిషనల్ రోల్స్‌లోకి మారిపోయిన సామ్.. విడాకుల తర్వాత ఉన్నట్లుండి గ్లామర్ డోస్ పెంచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. పుష్పలో ఊ అంటావా పాటలో ఆమె ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే.
ఐతే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందేమో అనిపిస్తోంది కేఆర్‌కే ప్రోమోల్లో ఆమె దూకుడు చూస్తే. ఇంతకు సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేస్తే.. అందులో నయనతార ఏమో చీరలో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ సామ్ మాత్రం మోడర్న్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేసింది. ఈ విషయంలో విఘ్నేష్ శివన్‌ను నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా. తాజాగా ఈ సినిమా నుంచి డిప్పం డప్పం అనే పాట ఒకటి రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా సేతుపతి, సామ్‌ల మీద తీసిన పాట.
ఈ పాటలో సామ్ మరింత ఘాటైన లుక్స్‌తో కనిపించింది. ఈ సినిమా అంతటా ఆమె గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని, తన పాత్ర కూడా ఆ తరహాలోనే ఉంటుందని ఈ పాట చూశాక అర్థమవుతోంది. ప్రోమోల్లో తన గ్లామరే తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షిస్తోందనడంలో సందేహం లేదు. మంచి ఫన్ ఎంటర్టైనర్‌లా కనిపిస్తున్న ఈ చిత్రం ఆచార్య లాంటి భారీ చిత్రానికి పోటీగా ఈ నెల 28న రిలీజవుతోంది. మరి సామ్ ఆకర్షణ ఏమాత్రం పని చేస్తుందో చూడాలి.
This post was last modified on April 21, 2022 8:26 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…