Movie News

రజినీ సినిమా క్యాన్సిలైందా?

నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల), శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘డాక్టర్’ సినిమాలతో కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయాడు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఆ రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘డాక్టర్’ ఇక్కడ మంచి హిట్టయింది. డార్క్ నేచర్ ఉన్న థ్రిల్లర్ కథాంశాలను ఎంచుకుని.. వినోదాత్మకంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రేక్షకుల మనసులు దోచాడు నెల్సన్.

‘డాక్టర్’ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే విజయ్ లాంటి టాప్ స్టార్ అతడితో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ వీరి కలయికలో సినిమాను నిర్మించింది. అదే.. బీస్ట్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తమిళనాడు వరకు వీకెండ్లో కొంచెం సందడి చేసి, ఆ తర్వాత చతికిలపడింది. మొత్తంగా విజయ్ ఖాతాలో చాన్నాళ్ల తర్వాత ఒక ఫ్లాప్ జమ అయింది.

ఐతే ‘బీస్ట్’ సినిమా ఫలితం తిరగబడడంతో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో దిలీప్ చేయాల్సి ఉన్న కొత్త చిత్రం క్యాన్సిల్ అయినట్లుగా రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ‘బీస్ట్’ రిలీజ్‌‌కు ముందే ఘనంగా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఖరారయ్యాడు.

ఐతే ‘బీస్ట్’ నిరాశ పరచడంతో నెల్సన్ మీద రజినీ, సన్ పిక్చర్స్ అధినేతలకు నమ్మకం పోయిందని.. దీంతో సినిమాను ఆపేస్తున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే దీనికి నెల్సన్ సమాధానం ఇచ్చాడు. ఈ రూమర్లపై నేరుగా స్పందించకుండా.. ‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అంటూ సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టాడు. అలాగే తన ట్విట్టర్ బయోలో కొత్తగా ‘తలైవర్ 169’ అంటూ ఈ సినిమాను సూచించే హ్యాష్ ట్యాగ్ జోడించి ఈ చిత్రం క్యాన్సిలేమీ కాలేదని, కచ్చితంగా ఉంటుందని చెప్పకనే చెప్పాడు నెల్సన్.

This post was last modified on April 20, 2022 7:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

14 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago