కేజీఎఫ్-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా మిగతా అన్ని చోట్లా సాధిస్తున్న వసూళ్లు ఒక ఎత్తయితే.. ఉత్తరాదిన రాబడుతున్న కలెక్షన్లు మరో ఎత్తు. అక్కడ ఈ సినిమా ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ ఇండియాలో తొలి నాలుగు రోజుల్లోనే రూ.190 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. ఏ డైరెక్ట్ హిందీ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగించలేదు ఇప్పటిదాకా. ఒక్క బాహుబలి-2కు మాత్రమే ఇలాంటి వసూళ్లు సాధ్యమయ్యాయి. వీకెండ్ తర్వాత కూడా ఆ సినిమా ఊపు తగ్గలేదు.
సోమవారం కూడా హిందీలో ఈ చిత్రం రూ.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిందంటే దాని జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. వీక్ డేస్‌లోనూ ఇలాంటి వసూళ్లు సాధిస్తున్న సినిమాకు పోటీగా ఇంకో మూడు రోజుల్లో మరో కొత్త చిత్రాన్ని దించాలంటే కంగారుగానే ఉంటుంది. అయినా సరే.. జెర్సీ టీం ధైర్యం చేస్తోంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ జెర్సీ హిందీ వెర్షన్.. ఏప్రిల్ 14కు రిలీజ్ ఖరారు చేసుకుని కూడా కేజీఎఫ్-2కు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి భయపడి వారం వాయిదా పడింది.
22కు కొత్త డేట్ ఫిక్స్ చేశారు. వీకెండ్ తర్వాత ఈ సినిమా జోరు తగ్గి ఉంటే.. జెర్సీ టీంలో టెన్షన్ తగ్గేది. కానీ ఆ సినిమా ఊపు తగ్గట్లేదు. వీకెండ్లో ఆ సినిమా మరింత దూకుడు ప్రదర్శిస్తుందనే అనుకుంటున్నారు. కానీ జెర్సీని ఈ వారమే రిలీజ్ చేయడం తప్ప వేరే ఛాయిస్ లేదు. ఆ తర్వాతి వారం నుంచి ప్రతి వీకెండ్‌కూ ఒక పెద్ద సినిమా షెడ్యూల్ అయి ఉంది. స్లాట్స్ ఖాళీ లేవు. పైగా ఇప్పటికే ఒకసారి కేజీఎఫ్-2కు భయపడి ఒక వారం వాయిదా వేశాక, ఇంకోసారి అదే కారణంతో పోస్ట్ పోన్ చేస్తే అది అవమానకరంగా ఉంటుంది.
రెండో వారంలో నడుస్తున్న కన్నడ అనువాద చిత్రానికి భయపడి రెండుసార్లు వాయిదా వేయడం బాగుండదు. అందుకే ఏదైతే అయ్యిందని రిలీజ్‌కు రెడీ అయిపోయారు. తెలుగు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే షాహిద్ కపూర్-మృణాల్ కపూర్ జంటగా ఈ సినిమాను రూపొందించాడు. దిల్ రాజు, నాగ వంశీ.. బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.
This post was last modified on April 20, 2022 7:22 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…