గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ‘లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆ చిత్ర సమర్పకుడి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. తాను 80వ దశకంలో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆ వ్యక్తితో తనకు మంచి సంబంధాలున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబం తెలుగు సినీ రంగంలో పోషించిన ముఖ్య పాత్ర గురించి.. ప్రస్తుతం తెలంగాణలో థియేటర్ల వ్యవస్థలో వారి ఆధిపత్యం గురించి.. వారి కారణంగా థియేటర్లలో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆయన అంత గొప్పగా మాట్లాడింది నారాయణ దాస్ నారంగ్ గురించే. చిరు ప్రసంగం విన్న చాలామందికి ఈయన ఈ స్థాయి వ్యక్తా అంటూ నారాయణ్ దాస్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జనాలకు తెలియని లెజెండ్. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఆయన స్థాయి ఏంటో అందరికీ బాగానే తెలుసు. ఆ లెజెండ్ ఇప్పుడు అనారోగ్యంతో హఠాత్తుగా కన్ను మూశారు. నారాయణ్ దాస్.. ఎగ్జిబిటర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇలా బహుముఖ పాత్రలు పోషించారు.
ఆయనకు తెలంగాణ పరిధిలో వందల సంఖ్యలో థియేటర్లున్నాయి. అందరూ తెలంగాణలో ఎక్కువగా థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయని అనుకుంటూ ఉంటారు కానీ.. ఈ ప్రాంతంలో అత్యధిక థియేటర్లున్నది ఏషియన్ వారి చేతుల్లోనే. సొంతంగా కట్టిన ఏషియన్ మల్టీప్లెక్సులన్నీ ఒకెత్తయితే.. పెద్ద ఎత్తున సింగిల్ స్క్రీన్లను చేతుల్లోకి తీసుకుని వాటిని రెనొవేట్ చేసి మల్టీప్లెక్స్ లుక్‌లోకి తెచ్చి ప్రేక్షకులను వాటి వైపు ఆకర్షించిన ఘనత నారాయణ్ దాస్ సొంతం.
ఇక మహేష్ బాబుతో కలిసి నారాయణ్ దాస్ స్థాపించిన ఏఎంబీ సినిమాస్ హైదరాబాద్‌లో ఒక సంచలనం. దీని వల్లే నారాయణ్ దాస్ పేరు అందరికీ తెలిసింది కూడా. ఎగ్జిబిషన్లో ఎదుగుతూనే డిస్ట్రిబ్యూషన్లోనూ దూసుకెళ్లిన ఏషియన్ మూవీస్.. కొన్నేళ్ల కిందటే నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే లవ్ స్టోరీ, లక్ష్య లాంటి చిత్రాలను నిర్మించింది. ఇప్పుడు ధనుష్-శేఖర్ కమ్ముల, అనుదీప్-శివకార్తికేయన్ సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థే. ఇలా ఏషియన్ మూవీస్ హవా అంతకంతకూ పెరుగుతున్న సమయంలో నారాయణ్ దాస్ అనారోగ్యంతో కన్నుమూయడం విచారకరం.
This post was last modified on April 19, 2022 6:35 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…