Movie News

మహేష్ అభిమానుల్ని కూల్ చేయడానికే..

#worstteamSVP.. రెండు రోజుల నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇక్కడ SVP అంటే ‘సర్కారు వారి పాట’కు సంక్షిప్త నామం. మహేష్ సినిమా మీద ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారంటే.. ఇదేదో యాంటీ ఫ్యాన్స్ పని అనుకుంటే పొరబాటే. ఈ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది మహేష్ బాబు అభిమానులే. వారి కోపం మహేష్ మీద కాదు.. నిర్మాతల మీద.

ఈ సినిమా నుంచి సరైన అప్‌డేట్స్ ఇవ్వకపోవడం.. అసలు ప్రమోషన్లే లేకపోవడంతో వారికి మండిపోయి ఇలా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద అంతకంతకూ ట్వీట్లు పెరిగిపోయి.. నేషనల్ లెవెల్లో ఇది ట్రెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ట్వీట్లలో కంటెంట్ చూస్తే తట్టుకోవడం కష్టమే. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను బూతులు తిట్టేసి, వారిని తెగ ట్రోల్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.

‘సర్కారు వారి పాట’ విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. ఐతే ఈ టైంలో చేయాల్సిన స్థాయిలో ప్రమోషన్లు చేయట్లేదని.. కొత్త పాటల ఊసే లేదని.. ట్రైలర్ ఎప్పుడో చెప్పట్లేదని.. ప్రి రిలీజ్ ముచ్చట్లేవీ లేదని మహేష్ అభిమానులు ఫీలవుతున్నారు. వేరే పెద్ద సినిమాలను ఎలా ప్రమోట్ చేశారో ఉదాహరణలు చూపిస్తూ.. అలా చేసి హైప్ పెంచకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పటికి రెండు పాటలు రిలీజయ్యాయి. అందులో కళావతి పాట బాగానే మార్మోగింది. కానీ పెన్నీ సాంగ్‌కు సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో సినిమా గురించి ఇప్పుడు ఎక్కడా పెద్ద చర్చ జరగట్లేదు.

ఈ నేపథ్యంలోనే మైత్రీ అధినేతల్లో చురుకుపుట్టాలన్న ఉద్దేశంతో ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ కోపం చూసి మైత్రీ వాళ్లు అలెర్టయినట్లే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్‌కు సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సాంగ్ రెడీ అవుతోందంటూ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇక నుంచి ఇదే ఊపును కొనసాగిస్తూ రిలీజ్ వరకు అభిమానులు మెచ్చేలా ప్రమోషన్లు చేస్తారేమో చూడాలి.

This post was last modified on April 19, 2022 3:08 pm

Share
Show comments

Recent Posts

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

56 minutes ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

2 hours ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

3 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

3 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

3 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

4 hours ago