50 కోట్ల షేర్.. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చి నిలకడగా వసూళ్లు సాధిస్తే వరల్డ్ ఈ షేర్ వస్తుంది. అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ పరంగా చిన్న టెరిటరీ అయిన రాయలసీమలో మాత్రమే ఒక సినిమా రూ.50 కోట్ల షేర్ సాధించడం అంటే మాటలా? ఈ అరుదైన ఘనతను ఆర్ఆర్ఆర్ సినమా అందుకుంది.
బాహుబలి-2 అయిదేళ్ల కిందట రూ.35 కోట్ల షేర్ సాధిస్తే ఔరా అనుకున్నారు. అప్పటికి అది పెద్ద రికార్డు. ఈ అయిదేళ్లలో ఏ సినిమా కూడా ఆ ఘనత దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. రూ.30 కోట్ల షేర్ కూడా ఏ చిత్రానికీ సాధ్యపడలేదు. అలాంటిది ఆర్ఆర్ఆర్ బాహుబలి-2 రికార్డును దాటేయడమే కాదు.. ఏకంగా రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ చిత్రాన్ని సీడెడ్ ఏరియాలో రూ.45 కోట్లకు అమ్మారు. ఇంత షేర్ రాబట్టడం చాలా కష్టమని, బయ్యర్లు చాలా రిస్క్ చేస్తున్నారని అన్నారు. కానీ ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ సాధించి బయ్యర్లకు రూ.5 కోట్ల అధికారిక లాభాన్ని తెచ్చిపెట్టింది. నిజానికి రాయలసీమలో ఆర్ఆర్ఆర్‌కు బ్లాక్ టికెట్ల దందా మామూలుగా నడవలేదు. థియేటర్లలోనే ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ చిత్రం అక్కడ రూ.50 కోట్ల షేర్ సాధించింది కానీ.. అనధికారికంగా ఇంకా ఎక్కువ షేరే వచ్చి ఉంటుందని అంచనా.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.250 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉండడం విశేషం. కేజీఎఫ్-2 ప్రభంజనం మొదలయ్యాక కూడా ఈ సినిమా ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే షేర్ రాబడుతోంది. ఆచార్య వచ్చే వరకు ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్ కొనసాగనుంది. ఈ వారాంతంలోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు.
This post was last modified on April 18, 2022 10:59 pm
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…