జూనియర్ ఎన్టీఆర్.. మూడున్నరేళ్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’కే అంకితమైపోయి ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా వేరే సినిమా మొదలు పెట్టలేదు. కొరటాల శివతో తారక్ తర్వాతి సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా ఆ సినిమా గురించి కొత్తగా ఏ అప్‌డేట్ లేదు. ప్రారంభోత్సవం, రెగ్యులర్ షూట్ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఎంతకీ అది జరగట్లేదు.
కొరటాల శివ ‘ఆచార్య’ పని ముగించి ఎప్పుడు ఈ సినిమాను మొదలుపెడతాడా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఈ నెల 29న ‘ఆచార్య’ రిలీజైపోతుండటంతో.. అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లో ఎన్లీఆర్ 30 షూటింగ్ మొదలు కావచ్చని వార్తలొస్తున్నాయి. కానీ అప్పుడైనా సినిమా మొదలవుతుందో లేదో అన్న అనుమానంతో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. ఇలాంటి డెడ్ లైన్లు చాలానే దాటిపోవడమే వారి సందేహాలకు కారణం.
ఐతే స్వయంగా కొరటాల శివనే ఇప్పుడు తారక్‌తో తాను చేయబోయే సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చాడు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. తారక్ కోసం తాను మంచి కథ రాసినట్లు ఆయన చెప్పాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. సినిమా గురించి తాను ఇప్పుడు ఏమీ మాట్లాడనని ఆయనన్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో తారక్ ఇమేజ్ పెరిగింది కాబట్టి దీన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారా అని అడిగితే.. ‘‘నాకసలు పాన్ ఇండియా అనే పదమే నచ్చదు. ఏ కథ అయినా ఎక్కువమంది చూడాలనే రాస్తాం తప్ప.. తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఒకలా.. పాన్ ఇండియా మార్కెట్ కోసమైతే ఇంకోలా అనేదమీ ఉండదు. పెద్ద, బలమైన కథను రాస్తే సహజంగానే అందరూ చూస్తారు. ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశా’’ అని కొరటాల అన్నారు. ‘ఆచార్య’ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారా అంటే అది నిర్మాత చూసుకుంటారని కొరటాల వ్యాఖ్యానించాడు.
This post was last modified on April 18, 2022 5:08 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…