సలామ్ రాకీ భాయ్.. సలామ్ రాకీ భాయ్.. ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులతా ఇదే పాట పాడుతున్నారు. ‘కేజీఎఫ్-2’ అనే కన్నడ డబ్బింగ్ సినిమా వారికి మామూలుగా పిచ్చెక్కించట్లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా లేని విధంగా ఈ సినిమా కోసం ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడుతున్న తీరు ట్రేడ్ పండిట్లకు విస్మయం కలిగిస్తోంది.
ఉత్తరాదిన మారు మూల ప్రాంతాల్లో ‘కేజీఎఫ్-2’ చూసేందుకు జనాలు ఎలా తహతహలాడిపోతున్నారో చూపించే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుున్నాయి. చివరగా ‘బాహుబలి-2’కు ఇలాంటి మేనియా చూశారు జనాలు. దాదాపు అదే స్థాయిలో ‘కేజీఎఫ్-2’ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అని తేడా లేదు.. ఎక్కడైనా టికెట్ల కోసం కొట్టేసుకుంటున్నారు. సోల్డ్ ఔట్ మెసేజ్‌లు, హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రిలీజ్ రోజు గురువారం నుంచి నుంచి ఇదే పరిస్థితి.
‘కేజీఎఫ్-2’కు రిలీజ్ ముంగిట వచ్చిన హైప్, జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసే బాలీవుడ్‌కు దిమ్మదిరిగిపోయింది. ఆ హైప్ వీకెండ్ అంతా కూడా కొనసాగింది. వసూళ్లు తగ్గనే లేదు. రెండో రోజు కూడా ఈ చిత్రం హిందీలో రూ.47 కోట్ల దాకా నెట్ వసూళ్లు రాబట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. శనివారం వసూళ్లు రూ.43 కోట్లకు అటు ఇటుగా వచ్చాయి.
ఆదివారం ట్రెండ్ చూస్తుంటే తొలి రోజుకు దీటుగా రూ.50 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. విడుదలైన నాలుగో రోజుకే ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువ కాబోతోంది. ఓ కన్నడ అనువాద చిత్రం హిందీలో ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం ఊహకందని విషయం.
అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన ‘బచ్చన్ పాండే’ గత నెలలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫుల్ రన్లో వంద కోట్లకు కూడా కలెక్ట్ చేయలేదు. అంతకుముందు మరో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సినిమా ‘83’కి కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఓవైపు బాలీవుడ్ భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతుంటే.. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2.. ఇలా వరుసగా సౌత్ సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేస్తుండటం బాలీవుడ్ జనాల్లో తీవ్ర కలవరం రేపేదే.
This post was last modified on April 17, 2022 3:21 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…